Wednesday, 4 November 2026

ఆర్థికసాయం అందించిన సర్పంచ్.

నెన్నెల, మే 24, (జనంసాక్షి )
మండలంలోని గొల్లపల్లి సర్పంచ్ ఇందూరి శశికళ రమేష్ బుధవారం రెండు కుటుంబాలకు ఆర్థికసాయం అందజేశారు. వారం రోజుల క్రితం నిరుపేద కుటుంబానికి చెందిన జాడి కిష్టయ్య, మంగళవారం రోజు లింగంపల్లి చంద్రయ్య అనారోగ్యంతో మరణించారు. మరణించిన ఆ రెండు కుటుంబాలు తీవ్ర పేదరికంలో మగ్గుతుండటంతో స్పందించిన సర్పంచ్ తనవంతుగా జాడి కిష్టయ్య కుటుంబానికి రూ. 4 వేల రూపాయలు, బియ్యం, లింగంపల్లి చంద్రయ్య కుటుంబానికి రూ. 3500, బియ్యం అందజేశారు. కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఆమె వెంట లింగంపల్లి రాజం, దుర్గం ప్రమోద్, పొన్నాల లింగయ్య తదితరులు ఉన్నారు.