Wednesday, 4 November 2026

వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి – మండల వైద్యాధికారి డాక్టర్. సన

హుజూర్ నగర్ మే 24 (జనంసాక్షి): మండలంలోని వేపలసింగారం గ్రామపంచాయతీ కార్యాలయంలో ఆరోగ్య శిభిరం, సీజనల్ వ్యాధుల పై అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. బుధవారం ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన మండల వైద్యాధికారి డాక్టర్. సన మాట్లాడుతూ పరిసరాల పారిశుధ్యం ద్వారా ప్రజలు మెరుగైన ఆరోగ్యాన్ని పొందవచ్చన్నారు. ఇంటి చుట్టుపక్కల నీటి నిల్వలు ఉన్న ఎడల దోమల వ్యాప్తి జరిగి మలేరియా, డెంగ్యూ , బోదకాలు, మెదడు వాపు వంటి వ్యాధులు వ్యాపిస్తాయనీ ఇంటి చుట్టు పక్కల కుండలు, టైర్లు ,జాడీలు డిస్పోజల్ గ్లాస్ లేకుండా చూడాలని వారానికి ఒకరోజు డ్రై డే పాటించి నీటి తొట్లు, డ్రమ్ములు , ఓవర్హెడ్ ట్యాంకులను కడిగి ఆరబెట్టాలనీ సూచించారు. గత రెండు రోజులుగా గ్రామంలో కొత్త జ్వరాలు నమోదు కాలేదని 8 మంది రక్త నమూనాలు సేకరించి జిల్లా కేంద్రానికి పంపినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అన్నెం శిరీష కొండారెడ్డి, మండల ఆరోగ్య విస్తరణాదికారి ప్రభాకర్, పిహెచ్ఎన్ నూర్జహాన్, ఉదయగిరి శ్రీను, ల్యాబ్ టెక్నీషియన్ రమేష్, పి.సావిత్రి, స్వరూపరాణి, కార్యదర్శి పెండెం నాగమణి, అంగన్ వాడి కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.