Tuesday, 3 November 2026

ఆర్థిక అక్షరాస్యత అవగాహణ సదస్సు,ఆర్థిక అక్షరాస్యత అవగాహణ సదస్సు

ఆర్థిక అక్షరాస్యత అవగాహణ సదస్సు,ఆర్థిక అక్షరాస్యత అవగాహణ సదస్సు,
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా:(జనం సాక్షి) 01డిసెంబర్ చింతలమానేపల్లి మండల కేంద్రంలోని రణవెల్లీ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఆర్థిక అక్షరాస్యత పై అవగాహన సదస్సు  రవీంద్రనగర్ తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ రవీందర్ రెడ్డి. ఆధ్వర్యంలో పిల్డ్ అఫీసర్ రాజ శేఖర్  అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాజాత మ్యాజిక్ బృందం వారిచే బ్యాంక్ ద్వారా అందే పలు పథకాలు, సేవలను ఆట పాట రూపంలో అవగాహణ కల్పించారు. అనంతరం బ్యాంక్ పీల్డ్ ఎఫీసర్ సి, ఎచ్ రాజ శేఖర్  మాట్లాడుతూ నగదు రహిత లావాదేవీలపై రైతులు తమ ఖాతాల ద్వారా నగదు లావాదేవీలు జరపాలన్నారు. పంట పెట్టుబడుల నిమిత్తం బ్యాంకు రైతులకు రుణాలిస్తుందని, పంట విక్రయించిన అనంతరం వచ్చిన డబ్బులు బ్యాంకుల్లో భద్రపర్చుకోవచ్చని. తెలిపారు. సామాజిక భద్రత పథకాలు, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి భీమ, ప్రధానమంత్రి సురక్షా భీమ యోజన,ఎస్ బి ఐ జనరల్ బీమా ఏడాదికి వెయ్యి, ఆటల్ పెన్షప్ యోజనలో 16 ఏండ్ల నుంచి 40 ఏండ్లలోపు యువకులు, రైతులు బీమా చేసుకోవాలన్నారు. డిజిటల్ లావాదేవీల పద్ధతులతోపాటు, సురక్షిత బ్యాంకింగ్ పద్ధతులు, బ్యాంకింగ్ ప్రాముఖ్యతపై ఖాతాదారులకు వివరించారు. ఈ సమావేశంలో క్యాషియర్ అశోక్ , మస్తాన్ పాల్గొన్నారు.