ఎయిడ్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి
_డాక్టర్ గౌతమ్.
పదర జనం సాక్షి
పదర ఎయిడ్స్ వ్యాధి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డాక్టర్ గౌతమ్ కుమార్ అన్నారు ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం పురస్కరించుకొని పదర మండల కేంద్రంలో ప్రభుత్వ దవాఖాన వారి సిబ్బందితో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ గౌతమ్ మాట్లాడుతూ ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన కలిగి ఉండాలని ఈ వ్యాధి అంటురోగం కాదని వారు తెలిపారు. ఎయిడ్స్ నిర్ధారణ పరీక్షలు చేపించుకోవడానికి ప్రజలు ముందుకు రావాలని వారు తెలిపారు. వ్యాధిగ్రస్తులు సమ యానికి మందులు వేసుకోవాలని బలవర్తకరమైన హారం తీసుకోవడం వల్ల జీవితకాలం పెంచుకోవచ్చని అన్నారు. అంటరాని వారిగా చూడకుండా మనోధారియం కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ గౌతమ్, పురుష ఆరోగ్య కార్యకర్తలు మాధవాచారి, మురళీధరన్, వైద్య సిబ్బంది చంద్రకళ, విజయ, బుజ్జమ్మ, కమల, సంధ్యారాణి, జ్యోతి, రాజేశ్వరి, మల్లయ్య, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఎయిడ్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి




