Monday, 2 November 2026

ఆర్థిక అవసరాలు తీర్చేలా వ్యాపారాలు సాగించాలి కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ నియోజకవర్గం కోఆర్డినేటర్ తోటకూర వజ్రెష్ యాదవ్ మేడిపల్లి – జనంసాక్షి

ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ అన్నివర్గాల ప్రజలకు ఆర్థికంగా అత్యవసర సమయంలో ఉపయోగపడేలా వ్యాపారం నిర్వహిస్తూ దినదినాభివృద్ధి చెందాలని కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ నియోజకవర్గం కోఆర్డినేటర్ తోటకూర వజ్రెష్ యాదవ్ అన్నారు. బోడుప్పల్ ప్రధాన రహదారిలో సీఎస్ బ్రదర్స్ ప్రక్కన నూతనంగా ఏర్పాటు చేసిన కేఎల్ఎం ఆక్సివియా ఫిన్వెస్ట్ బ్రాంచ్ ను శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బోడుప్పల్లో  అత్యధికంగా నివసించేది పేద ప్రజలేనని, వారి అత్యవసర ఆర్థిక పరిస్థితుల్లో అవసరాలను తీర్చే విధంగా తక్కువ వడ్డీకి వ్యాపారాలను నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు తోటకూర అజయ్ యాదవ్, బొమ్మక్ కళ్యాణ్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ పొన్నం తరుణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.