Wednesday, 4 November 2026

ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఒకరు ఆత్మహత్య చేసుకున్న ఘటన

 

 

 

 

 

 

 

 

భైంసా రూరల్ ఏప్రిల్ 08జనం సాక్షి  నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో ఆర్థిక ఇబ్బందులు తాళ లేక ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటుచేసుకుంది. పట్టణ సీఐ ఎల్. శ్రీను,స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం కుభీరు మండలం పార్డి-కె గ్రామానికి చెందిన సంజీవకుమార్ (30) కొంతకాలం నుంచి భైంసా గీతానగర్ లోని అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. కొన్ని రోజుల నుంచి ఆయన భార్య, పిల్లలు పుట్టింటికి వెళ్లారు.ఒంటరిగా ఉన్న ఆయన శుక్రవారం మధ్యాహ్నం ఇంట్లో తలుపులు బిగించుకుని బయటకు రాలేదు. అనుమానంతో కిటికీలోంచి చూడగాసీలింగ్ ఫ్యాన్కు ఉరేసుకుని వేలాడుతున్నట్లు గుర్తించారు.ఆర్థిక ఇబ్బందులతో ఏ పని చేయలేక మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.