పెనుబల్లి, ఫిబ్రవరి 13(జనం సాక్షి) పెనుబల్లి మండలం పెనుబల్లి గ్రామపంచాయితీ లో సోమవారం రోడ్డు పనులకు మాజీ ఎం పి టి సి, బి ఆర్ ఎస్ నాయకులు కోటగిరి సుధాకర్, సర్పంచ్ తావు నాయక్ లు భూమి పూజ చేశారు, కోటగిరి వీధి నుండీ ముత్యాలమ్మ గుడి రోడ్డుకు గ్రావెల్ తోలకం, సైడు కాలువల తొవ్వకాలు చేపట్టనున్నారు, కార్యక్రమంలో నాయకులు బొర్రా వేంకటేశ్వర్లు, ఉప సర్పంచ్ పానెం నాగేశ్వరావు, మల్లెల సతీష్, చీపి వెంకటేశ్వర్లు, బండి వెంకటేశ్వర్లు , జిల్లెల వెంకటేశ్వర్లు, ప్రేమా నందం, బెజవాడ కోటి స్వామి, బెజవాడ బాబు, పెద్ద గౌడ్, వంగా చెన్నా రావు ఉబ్బన రవి,తదితరులు పాల్గొన్నారు.




