ఆర్ధిక సహాయం అందజేత

జనంసాక్షి , కమాన్ పూర్, అక్టోబర్ 06: పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండలంలోని గుండారం గ్రామపంచాయతీ పరిధిలోని రాజాపూర్ లోని నిరుపేద కుటుంబానికి చెందిన కుంభం కనకయ్య కు కుడి కాలు తీసేయడం వల్ల హాస్పటల్ ఖర్చులు లేక ఇబ్బంది పడుతున్న తరుణంలో వారి కుటుంబ సభ్యులు కమాన్ పూర్ లయన్స్ క్లబ్ అధ్యక్షులు సాన రామకృష్ణారెడ్డిని సంప్రదించగా వారు స్పందిస్తూ వారి యొక్క సంత డబ్బులు పదివేల రూపాయలు హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం లైన్స్ క్లబ్ ఆఫ్ కమాన్ పూర్ ఆధ్వర్యంలో అందజేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ కమాన్ పూర్ అధ్యక్షులు సాన రామకృష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శి నల్లవెల్లి శంకర్, లైన్స్ క్లబ్ సభ్యులు లయన్ బండ సాయి శంకర్, లయన్ జబ్బర్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.