ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా పొట్టి శ్రీరాములు వర్ధంతి వేడుకలు హుజూర్ నగర్ డిసెంబర్ 15(జనంసాక్షి): హుజూర్ నగర్ పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో పొట్టిశ్రీరాములు 70 వ వర్ధంతి సందర్భంగా స్థానిక కన్యకా పరమేశ్వరి భవన్ లో గురువారం ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు పొట్టి శ్రీరాములు1952 అక్టోబర్ 19న మద్రాసులో బులుసు సాంబమూర్తి ఇంట్లో ఆమరణ నిరాహారదీక్ష ప్రారంభించాడు. మామూలుగా ప్రారంభమైన దీక్ష, క్రమంగా ప్రజల్లో అలజడి రేపింది. చివరికి 1952 డిసెంబర్ 15 అర్ధరాత్రి పొట్టి శ్రీరాములు, తన ఆశయసాధనలో ప్రాణాలర్పించి అమరజీవి అయ్యాడు. ఆగ్రహావేశులైన ప్రజలు హింసాత్మకచర్యలకు పాల్పడ్డారు. మద్రాసులో జరిగిన ఆయన అంతిమ యాత్రలో నినాదాలతో ప్రజలు ఆయన త్యాగనిరతిని కొనియాడారు. చివరికి డిసెంబర్ 19న ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుచేస్తూ ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోరకు తన ప్రాణాలర్పించిన పొట్టి శ్రీరాములు దీక్ష మరువలేనిదని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు ఓరుగంటి నర్సింహా రావు, సెక్రటరీ పొలిశెట్టి లక్ష్మినర్సింహా రావు, వైస్ ప్రెసిడెంట్ 4వార్డు కౌన్సిలర్ ఓరుగంటి నాగేశ్వరావు, ఓరుగంటి మట్టయ్య , ఏలూరి రాంబాబు, గుండా శ్రీనివాస్, మాశెట్టి గణేష్ , గుండా సాయి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా పొట్టి శ్రీరాములు




