Thursday, 5 November 2026

విద్యార్థినిలు ఉపకార వేతనాలు పొందడం ఎంతో ఉపయోగకరం

విద్యార్థినిలు ఉపకార వేతనాలు పొందడం ఎంతో ఉపయోగకరం
మిర్యాలగూడ, జనం సాక్షి : పాఠశాల స్థాయి నుండి ఉపకార వేతనాలు పొందడం వలన విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కె విజయలక్ష్మి అన్నారు. గురువారం పాఠశాల ఆవరణలో నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ పాఠశాల స్థాయిలో ప్రతి సంవత్సరం 8వ తరగతి విద్యార్థులకు నిర్వహించే నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ కోసం అవగాహన పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పరీక్ష నిర్వహించే విధానం గురించి విద్యార్థినిలకు వివరించటం జరిగిందని తెలిపారు. విద్యార్థుల అవగాహన కోసం ఈ పరీక్షా పత్రము ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు ఈ సందర్భంగా యూత్ ఫర్ సేవ నల్గొండ జిల్లా కోఆర్డినేటర్ పరశురాం ఆధ్వర్యంలో వారు ప్రశ్నాపత్రాలను విడుదల చేసి నమూనా పరీక్ష నిర్వహించడం జరిగింది ఈ నమూనా పరీక్ష జాతీయ స్కాలర్షిప్ ఎంపికలో ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రజితమ్మ, నాగమణి,గీత, పుష్పలత, అస్మతార పద్మావతి, గోపారపు రాజు తదితరులు పాల్గొన్నారు