Monday, 2 November 2026

ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ వర్ధంతి

 

 

 

 

 

 

వేడుకలు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ వర్ధంతి వేడుకలు
మఖ్తల్ జనవరి 30 (జనంసాక్షి) ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ 75వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వాసవి కన్యక పరమేశ్వరి దేవాలయం దగ్గర జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి ఆర్యవైశ్య సంఘం నాయకులు పూలమాలతో ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మక్తల్ పట్టణ పురవీధుల గుండా గాంధీ నినాదాలు చేసుకుంటూ వాసవి దేవాలయం వరకు బైక్ లపై ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్యవైశ్య సంఘం నాయకులు మాట్లాడుతూ మాత్మ గాంధీ సత్యం, అహింసా సిద్దాంతాలతో సహాయ నిరకరణ ఉద్యమం చేపట్టాడు. సత్యాగ్రహం ఆయుధాలతో రవి అస్తమించని బ్రిటి సామ్రాజ్యాన్ని గడగడ లాడించిన స్వతంత్ర సమరయోధుడు మహాత్మా గాంధీజీ అని అన్నారు. ఈరోజు భారతీయుల హృదయాల్లో మొత్తం బాధతో నిండుకున్న రోజు. గాంధీ లాంటి మహోన్నతమైన వ్యక్తి మన వైశ్య జాతిలో పుట్టడం వైశ్య జాతికే గర్వకారణం అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్మాణ కమిటీ అధ్యక్షుడు కట్ట సురేష్, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు భాస్కర్, పొర్ల వెంకటేష్, నాగరాజ్, దొంత నరహరి, అనుగొండ జగదీష్, మనసాని బాలకృష్ణ, బుచ్చయ్య బాల పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.