హుజూర్ నగర్ జనవరి 30 (జనంసాక్షి): మహాత్మా గాంధీ వర్ధంతి పురస్కరించుకొని హుజూర్ నగర్ పట్టణ ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో సోమవారం గాంధి పార్క్ వద్ద గల గాంధీ మహాత్ముడి విగ్రహం వద్ద పుష్పగుచ్చములతో ఘనంగా నివాళులు అర్పించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు ఓరుగంటి నరసింహారావు, మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు పోలిశెట్టి వెంకట నరసింహారావు, వర్తక సంఘం అధ్యక్షులు ఉప్పల రమేష్ బాబు, ఆవోపా ప్రెసిడెంట్ హనుమంతురావు, 4 వార్డు కౌన్సిలర్ ఓరుగంటి నాగేశ్వరరావు, వూరే వెంకయ్య, గజ్జి ప్రభాకర్ రావు, నిరుమళ్ళ నర్సింహారావు, వంకాయల పద్మ, తమ్మన సుజాత, ఆరేటి వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.




