Wednesday, 4 November 2026

నేడు తబ్లిక్ ఇస్తేమా కు తరలిరండి మాజీ ఉపసర్పంచ్ షేక్ జహంగీర్ గుమ్మడవల్లి

నేడు తబ్లిక్ ఇస్తేమా కు తరలిరండి మాజీ ఉపసర్పంచ్ షేక్ జహంగీర్ గుమ్మడవల్లి
కొండమల్లేపల్లి నవంబర్ 29 జనం సాక్షి న్యూస్ :
కొండమల్లేపల్లి మండల కేంద్రం గుమ్మడవల్లి గ్రామ మాజీ ఉపసర్పంచ్ షేక్ జహంగీర్ మాట్లాడుతూ నేడు నల్గొండ పట్టణంలోని ఈద్గాహ్ ప్రాంతంలో జరిగే తబ్లిక్ ఇస్తేమా కు భారీ ఎత్తున తరలివెళ్లాలని పేర్కొన్నారు.శాంతి మరియు అహింస, సందేశమే ఎజెండా గా నల్లగొండ లో ఇస్తేమా జరుగుతుందని జిల్లా వ్యాప్తంగా వేలాది మంది ముస్లిం సోదరులు ఈ కార్యక్రమానికి హాజరౌతారని, ఢిల్లీ నిజాముద్దీన్ మర్కస్ నుండి ఉలేమాలు, మత ప్రభోదకులు వచ్చి నల్గొండ ఇస్తేమా లో ప్రసంగిస్తారని తెలిపారు. దేవరకొండ నియోజకవర్గ స్థాయిలోను ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున ఇస్తేమాకు తరలి రావాలని ఒక ప్రకటనలో పేర్కొన్నారు