Tuesday, 3 November 2026

ఆర్‌టిసి బస్సుకు తప్పిన ప్రమాదం

అనంతపురం : పుట్టపర్తి మండలం మామిళ్లకుంట క్రాస్ వద్ద ఓ ఆర్‌టిసి బస్సుకు పెనుప్రమాదం తప్పింది. ఈ ఘటన మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. గోరంట్ల – పుట్టపర్తి మార్గంలో బైక్‌పై ధర్మవరం వెళుతున్న ఓ యువకుడు బస్సును ఢీకొనబోయాడు. దీంతో అప్రమత్తమైన బస్సు డ్రైవర్ ఒక్కసారిగా స్టీరింగ్‌ను పక్కకు తిప్పాడు. దీంతో అదుపు తప్పిన బస్సు పాదచారులను ఢీకొని సమీపంలోని బావి సమీపంలోకి దూసుకెళ్లింది. డ్రైవర్ చాకచక్యంతో బ్రేకులు వేచి ఎటువంటి ప్రమాదం జరగకుండా చేశాడు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటనలో ఓ పాదచారి చనిపోయాడు. బస్సులోని ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.