Tuesday, 3 November 2026

ఆర్.ఎం.పి పి.ఎం.పి ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలి.

 

 

 

 

 

గ్రామీణ వైద్యుల సమాఖ్య సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు కుడిక్యాల రవి కుమార్.రాజన్న సిరిసిల్ల బ్యూరో. జనవరి 27. (జనంసాక్షి) గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందిస్తున్న ఆర్ఎంపి పిఎంపీల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని గ్రామీణ వైద్యుల సమాఖ్య పట్టణ అధ్యక్షులు కుడిక్యాల రవికుమార్ అన్నారు. శుక్రవారం బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్యను కలిసి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ ఆర్.ఎం.పి పిఎంపీల సమస్యలను సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారమయ్యేలా చూడాలని కోరుతూ సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు రాజమల్లు, మిట్టపల్లి రాజమౌళి, మాసం భాస్కర్, అల్వాల ఈశ్వర్, జెండాల ఆంజనేయులు అన్ని మండలాల ప్రతినిధులు పాల్గొన్నారు