–
-ఫోటోగ్రాఫర్స్ యూనియన్ జిల్లా కోశాధికారి గూళ్ళ చెన్నకేశవులు.-చికత్స పొందుతున్న ఫోటోగ్రాఫర్ ను పరామర్శించిన కేశవ్.నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,జనవరి 27 (జనం సాక్షి):జిల్లాలోని ఫోటో గ్రాఫర్ లు అందరికీ ఎల్లప్పుడూ అన్నివిధాలా అండగా ఉంటాన ని జిల్లా ఫోటో గ్రాఫర్స్ యూనియన్ కోశాధికారి గూళ్ళ చెన్నకేశవులు అన్నారు. శుక్రవారం ప్రమాదవశాత్తు గాయాలపాలై జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కొల్లాపూర్ కు చెందిన సీనియర్ ఫోటోగ్రాఫర్ ఖయ్యుం ను ఫోటో గ్రాఫర్స్ యూనియన్ జిల్లా కోశాధికారి గూళ్ళ చెన్నకేశవులు పరామర్శించించడం జరిగింది.ఈ సందర్భం గా చెన్నకేశవులు మాట్లాడుతూ సీనియర్ ఫోటోగ్రాఫర్ ఖయ్యుం త్వరలో కోలుకోవాల ని అన్నారు.జిల్లాలోని ఫోటోగ్రాఫర్ లు అందరూ ఖయ్యుంకు తమ వంతు ఆర్థిక సాయం చేసి తోడుగా నిలవాలని పిలుపునిచ్చారు.




