Tuesday, 3 November 2026

మనం ఎక్కడున్నా ప్రజాసేవకే మన జీవితం అంకితం – శశికాంత్

మనం ఎక్కడున్నా ప్రజాసేవకే మన జీవితం అంకితం
– శశికాంత్
జహీరాబాద్ జనవరి 2( జనం సాక్షి) మనం ఎక్కడున్నా ప్రజాసేవకే మన జీవితం అంకితం కావాలని బి ఎస్పీ నియోజకవర్గ అసెంబ్లీ ఇంచార్జి శశికాంత్ అన్నారు. సోమవారం బి ఆర్ ఎస్ యూత్ మండల ఉపాధ్యక్షుడు శ్రీకాంత్ ను కలసిన సందర్భంగా ఆయన సన్మానించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన
మాట్లాడుతూ యువకులను రాజకీయాల్లోకి తీసుకురావడం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న శశికాంత్ ప్రత్యక్ష రాజకీయాల్లో చాలా చురుగ్గా ఉంటున్నారని భవిష్యత్తులో తన మిత్రుడు శశికాంత్ గిరకల మంచి ప్రజానాయకుడుగా అవతరిస్తారని కొనియాడారు అలాగే శాలువాతో సన్మానించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే బహుజన సమాజ్ పార్టీ జహీరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జ్ శశికాంత్ గిర్కల మాట్లాడుతూ నా మిత్రుడు ఇప్పుడు అధికార పార్టీ బి.ఆర్.ఎస్ లో యువజన నాయకునిగా పనిచేస్తున్నారు, త్వరలోనే మంచి రాజకీయ నేతగా ఎదగాలని ఆశిస్తున్నాను అని ఈ సందర్భంగా ఆయనకు భారత రాజ్యాంగ పుస్తకాన్ని బహూకరించారు.