Thursday, 5 November 2026

ఆర్ టి సి బస్సులలో ప్రయాణం సురక్షితం డిఎమ్. జి. పరమేశ్వరి

ఆర్ టి సి బస్సులలో ప్రయాణం సురక్షితం డిఎమ్. జి. పరమేశ్వరి

పెబ్బేరు నవంబర్ 12 ( జనంసాక్షి ):
వనపర్తి డిపో పరిధిలోని పెబ్బేరు లో ప్రజల వద్దకు ఆర్టీసీ అనే అంశంపై కళాజాత కార్యక్రమం నిర్వహించారు. ఆర్టీసీ గురించి కళాకారులు పాటల రూపంలో వివరించారు. సందర్భంగా వనపర్తి బస్సు డిపో మేనేజర్ జి.పరమేశ్వరి మాట్లాడుతూ ప్రైవేటు వాహనాల కంటే ఆర్టీసీలో సురక్షిత ప్రయాణం అన్నారు. ఆర్టీసీ కల్పిస్తున్న సౌకర్యాలను వివరించారు.ఎండి సజ్జనార్ ఆదేశాను ప్రకారంగా కలాబృందాలు అన్ని డిపోలో పరిధిలో కళాజాతను నిర్వహిస్తున్నారు. విద్యార్థులకు మరియు దివ్యాంగులకు రాయితీతో ఇచ్చే బస్ పాసులను వివరించినారు. కార్గో సర్వీస్ ల గురించి వివరించారు. కళాబృందము మన వనపర్తి డిపోలో నాలుగు రోజులపాటు వివిధ పట్టణాలలో కార్యక్రమాలు నిర్వహించబడునని తెలిపారు. కార్యక్రమంలో సహాయక మేనేజర్ జి.చంద్రమౌళి, సహాయక ఇంజనీర్ కె. వి రాజశేఖర్, బి.మణ్యం తదితరులు పాల్గొన్నారు