ప్రజలకు సేవల చేయడమే నిఖిల్ రెడ్డి ఆశయం..
– ఆపదలో ఉన్న వారికి ఆర్థిక సాయం.
– కాంగ్రెస్ మండల నాయకులు.
ఊరుకొండ, నవంబర్ 12 (జనంసాక్షి):
బడుగు బలహీన వర్గాల పేద ప్రజలకు తన వంతు సహాయ సహకారాలు అందించి సేవ చేయడమే మాదారం సర్పంచ్ ద్యాప నిఖిల్ రెడ్డి ఆశయమని కాంగ్రెస్ మండల నాయకులు అన్నారు. శనివారం ఊరుకొండ మండలంలోని రాంరెడ్డిపల్లి గ్రామానికి చెందిన బీరమ్మ(55) అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందింది ఈ విషయాన్ని స్థానిక కాంగ్రెస్ నాయకుల ద్వారా తెలుసుకున్న ధ్యాప నిఖిల్ రెడ్డి వెంటనే బాధిత కుటుంబానికి ప్రగడ సానుభూతి తెలియజేస్తూ.. బాధిత అండగా ఉండాలనే లక్ష్యంతో 5వేల ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు, డిఎన్ఆర్ యువసేన సభ్యులు మాట్లాడుతూ.. మండల ప్రజలకు ఎల్లవేళలా అండగా ఉంటూ పేద, బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి తన వంతు సాయం అందజేస్తున్న నాయకుడు ద్యాప నిఖిల్ రెడ్డి పేర్కొన్నారు. మండల ప్రజలు బాధలో ఉన్నారంటే ముందుగా గుర్తుకొచ్చే పేరు ద్యాప నిఖిల్ రెడ్డి అని.. ప్రజల శ్రేయస్సు కోసం పరితపిస్తూ వారి ఉన్నతకి కృషి చేస్తున్న గొప్ప వ్యక్తి యనీ కొనియాడారు. ఆయన సేవలకు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, డి.ఎన్.ఆర్ యువసేన సభ్యులు, తదితరులు పాల్గొన్నారు
ప్రజలకు సేవల చేయడమే నిఖిల్ రెడ్డి ఆశయం..




