కబడ్డీ విజేతలకు బహుమతుల ప్రదానోత్సవం
మునగాల, నవంబర్ 12(జనంసాక్షి): మునగాల మండల పరిధిలోని నర్సింహాపురం గ్రామంలో శ్రీకోదండరామస్వామి తిరు కళ్యాణ మహోత్సవం సందర్భంగా నిర్వహించిన కబడ్డీ, డాన్స్ బేబీ డాన్స్ బహుమతులను శనివారం రాత్రి అందజేశారు. కబడ్డీలో మొదటి బహుమతిగా గుంటూరు, రెండవ బహుమతి కల్లూరు, మూడవ బహుమతి నూతనకల్, నాలుగవ బహుమతి గణపవరం, ఐదవ బహుమతి బరాఖత్ గూడెం, ఆరవ బహుమతి ఆలగడప, ఏడవ బహుమతి నర్సింహాపురం క్రీడాకారులు గెలుపొందినట్లు తెలిపారు. అలాగే డాన్స్ బేబీ డాన్స్ పోటీలలో మొదటి బహుమతి నరసాపురం, రెండవ బహుమతి శ్రీరామ యూత్, మూడవ బహుమతి కట్టకొమ్ముగూడెం వారు గెలుచుకున్నారు. ఈ కార్యక్రమంలో కబడ్డీ మొదటి బహుమతి దాత పిల్లుట్ల శ్రీనివాస్, రెండవ బహుమతి దాత దేవినేని త్రిలోక్ చౌదరి, మూడవ బహుమతి దాత కాటంరెడ్డి ప్రసాద్ రెడ్డి, సామాజిక ఉద్యమకారులు వేమూరి సత్యనారాయణ, బహుజన సమాజ్ పార్టీ కోదాడ నియోజకవర్గ ఇన్చార్జి కందూకూరి ఉపేందర్, విలాసకవి రమేష్ రాజు, బొమ్మ చిన్నవెంకన్న, కారంగుల వెంకట సైదులు, కిన్నెర వెంకటేష్, రేవూరి బాబు, బారి లక్ష్మయ్య, గెలుపొందిన విజేతలు, న్యూ జనరేషన్ యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.




