ఐదువేల రూపాయల నగదు పారితోషికం అందించిన ఆర్.బి.ఐ అధికారులు
జనం సాక్షి,చెన్నారావుపేట
మండల కేంద్రంలోని సిద్ధార్థ హై స్కూల్ లో
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు జి20 సదస్సు నేపథ్యంలో ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కల్పించడానికి నిర్వహించిన క్విజ్ పోటీలలో చెన్నారావుపేట మండలం ఉప్పరపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు చెలకలపల్లి సిద్ధార్థ, వెలిదె ఆకాష్ ప్రథమ స్థానం పొందారు.గైడ్ టీచర్ గా ఆమంచ రవి కుమార్ వ్యవహరించారు. వీరికి 5000 రూపాయల నగదు బహుమతి, ప్రశంసా పత్రం అందించారు.ద్వితీయ బహుమతిని జల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు బి. రాహుల్, బి.చరణ్ లు పొందారు. వీరికి నాలుగు వేల రూపాయల బహుమతిని ప్రధానం చేశారు. డి.అశోక్ గైడ్ టీచర్ గా వ్యవహరించారు.తృతీయ బహుమతిని లింగాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎం.సుశ్మిత,బి.వినయ్ పొందారు. వీరికి 3000 రూపాయల బహుమతిని ప్రధానం చేశారు.గైడ్ టీచరుగా సిహెచ్ పరమేశ్వర్ వ్యవహరించినట్లు ఎస్బిఐ ఎల్డిఎం, కార్యక్రమం నోడల్ ఆఫీసర్ హవేలీ రాజు, చెన్నారావుపేట స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ మనోజ్ తెలిపారు.కార్యక్రమ నిర్వాహకులుగా ఎస్బిఐ ఫీల్డ్ ఆఫీసర్ ప్రసన్న, సెంటర్ ఫర్ ఫైనాన్షియల్ లిటరసీ అధికారి నరేష్ వ్యవహరించారు.విద్యార్థులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్యకలాపాలు, ఆర్థిక అక్షరాస్యత పైన అవగాహన చేశారు.క్విజ్ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పోలేపల్లి రవి, తుమ్మ వేణుబాబు,సుధాకర్,ఎం.సరస్వతి మరియు మండలంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల నుంచి విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.పోటీలలో ప్రథమ స్థానం పొందిన ఉప్పరపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులను జూలై 4న వరంగల్ లో నిర్వహించే జిల్లా స్థాయి పోటీలకు పంపుతామని నిర్వాహకులు తెలిపారు.




