Tuesday, 3 November 2026

ఫైనాన్షియల్ లిటరసీ క్విజ్ లో ప్రతిభ చూపిన విద్యార్థులు

వేములవాడ రూరల్, జూన్ 27 (జనంసాక్షి): ఆర్బిఐ ఫైనాన్షియల్ లిటరసీ మండల స్థాయి క్విజ్ పోటీలను మంగళవారం మండల విద్యా వనరుల కేంద్రంలో నిర్వహించారు. పాఠశాల స్థాయిలో ప్రతిభ కనబరిచిన పదో తరగతికి చెందిన ఇద్దరు విద్యార్థుల చొప్పున పోటీలో పాల్గొన్నారు. యూనియన్ బ్యాంక్ అధికారులు ప్రకాష్,లావణ్య, మండల నోడల్ అధికారి మధుకర్ ఆధ్వర్యంలో పరీక్ష నిర్వహించడం జరిగింది. పోటీలో మొదటి విజేతలుగా కేజీబీవీ వేములవాడ అర్బన్ పాఠశాలకు చెందిన బి.అక్షిత జి. హంసిని, రెండవ విజేతగా తెలంగాణ గురుకుల రెసిడెన్షియల్(ఎస్సి) పాఠశాలకు చెందిన విద్యార్థులు ఎం. హారిక జె.స్పందన, మూడవ విజేతగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మారుపాక పాఠశాలకు చెందిన భావన, పవిత్రలు నిలిచినట్లు అధికారులు తెలిపారు. విజేతలకు నగదు పారితోషకాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు అంజయ్య, సిఆర్పిలు ఆకుల శ్రీనివాస్, ఎనుగందుల నగేష్ ,ఎల్లేష్ రాజు, చైతన్య సంతోషి, ఐఈఆర్పి జయ, ఆఫీస్ సిబ్బంది నవీన్, పోగుల ధనుంజయ్,ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.