Wednesday, 4 November 2026

ఆలూరు గ్రామంలో తెలంగాణ అవతరణ శతాబ్ది ఉత్సవాల కార్యక్రమంలో ఘనంగా రైతు శతాబ్ది దినోత్సవ ఉత్సవాలు

చేవెళ్ల జూన్ 03 (జనంసాక్షి) చేవెళ్ల మండలం ఆలూరు గ్రామంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రైతు శతాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. చేవెళ్ల మండలంలోని వివధ గ్రామాల్లోని రైతులు ఎడ్ల బండ్లు ట్రాక్టర్లు లతో భారీ ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. తెలంగాణ అవతరణ దినోత్సవ సందర్భంగా రైతు శతాబ్ది ఉత్సవాల్లో ముఖ్యఅతిథిగా చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యాదయ్య మాట్లాడుతూ…మన తెలంగాణ తల్లీ దేశానికే అన్నపూర్ణ తల్లీ అని కొనియాడారు. ప్రపంచం మెచ్చిన రైతుబంధు అన్నదాతకు ఆత్మబంధు తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం ప్రతిష్టకంగా తీసుకున్న రైతు బంధు పథకం దేశంలోనే ఏ రాష్ట్ర ప్రభుత్వము చేయలేని పథకాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులందరికీ పెట్టుబడి ఆసరా కింద రైతుబంధు అందిస్తుంది. తెలంగాణ ప్రభుత్వం రైతగంలో సాధించిన విజయాలను సాధించిన కృషిని రైతులందరికి ఎమ్మెల్యే వివరించారు. 9 సంవత్సరాల తెలంగాణ పాలనలో తెలంగాణ రాకముందు తెలంగాణ వచ్చినంక ఎట్లుండే తెలంగాణ వచ్చినంక రైతులందరికీ 24 గంటల ఉచిత కరెంటు కాలేశ్వరం నీళ్లు రైతుల కళ్ళల్లో ఆనందాలు రైతుల ఇంట్లో చిరునవ్వుల పంటలు పండుతున్నాయి అని అన్నారు. నీటిపారుదల రంగంలో, విద్యుత్ రంగంలో సాధించిన విజయాల కారణంగా సాగు విస్తీర్ణం పెరిగిందని, పంజాబ్ కు ధీటుగా నేడు తెలంగాణలో వరి సాగు జరుగుతుందని, భూములకు భారమైన స్థాయిలో వరి పంట పండుతుందని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నీళ్ల కోసం నిధుల కోసం పోరాడిన తెలంగాణ రైతాంగం నేడు స్వరాష్ట్రం లో కాళేశ్వరం ప్రాజెక్టు, నీటి ప్రాజెక్టులు మరియు రైతు బంధు,రైతు భీమా,ఉచిత కరెంట్ ఇతర రైతు సంక్షేమ పథకాల ద్వారా తెలంగాణ పచ్చని పంట పొలాలతో దేశానికి అన్నం పెట్టే స్థాయికి ఎదిగిందిన్నరు. రైతు వేదికలు నిర్మించి రైతులకు మార్కెట్ లో పంట డిమాండ్, గిట్టుబాటు ధర, పంటలు పండించడంలో మెలుకవులు, ఎరువులు, విత్తనాల వినియోగం వంటి వాటి పై సంబంధిత అధికారులతో అవగాహన కల్పించడం జరుగుతున్నది. ఆసరాతో మొదలైన ధీమా రైతు బంధుని కలుపుకుని దళిత బంధుతో బతుకు ధీమాగా నిలిచిందిన్నారు. వలసలతో ఆగం అయిపోయిన నేల మీద ప్రభుత్వమే దగ్గరుండి ధాన్యం కొనేలా ఎదిగిన ప్రస్తావించారు. ఏ రంగాన చూసిన దేశానికి మార్గదర్శకంగా నిలిచిన మాన తెలంగాణ రాష్ట్రం దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సాగు భూములను ఆన్లైన్ చేసి ఉచితంగా డిజిటల్ పాస్ పుస్తకాలను అందించడం జరిగిందిన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రిజిస్ట్రేషన్ అయిన వెంటనే మ్యుటేషన్ చేసి పాస్ బుక్ లో అరగంటలోనే చేర్చడం జరుగుతుంది అని పేర్కొన్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఉద్యాన పంటలు 72420 ఎకరాల విస్తీర్ణం సాగు చేయబడుతూ, 518541 మెట్రిక్ టన్నుల ఉత్పత్తిని సాధిస్తున్నది. ప్రధాన ఉద్యాన పంటలైన మామిడి, బొప్పాయి, జామ, కూరగాయలు, పువ్వులు మొదలగు ఉద్యాన పంటలను పండించుటకు మన జిల్లాలోని భూములు అనుకూలంగా ఉన్నాయి. మార్కెట్ డిమాండ్ కలిగిన పండ్లు, కూరగాయలను మరియు పువ్వులు మన జిల్లాలో అధిక విస్తీర్ణంలో పండించవలసిన అవసరం ఎంతైనా ఉందిన్నారు. రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి ఇప్పటివరకు జిల్లాలో వివిధ పథకాలలో విజయాలు సాధించామని అన్నారు. సమీకృత ఉద్యాన అభివృద్ధి మిషన్, పథకం సూక్ష్మ నీటి సేద్య పథకం, మైక్రో ఇరిగేషన్ రాష్ట్రీయ కృషి వికాస్ యోజన పథకం, పాలిహౌస్ మరియు నెట్ హౌస్ పథకం,పట్టు పరిశ్రమల పథకం రైతులకు చాలా ఉపయోగాలు ఉన్నాయి అన్నారు. వివిధ పండ్ల తోటల విస్తీర్ణం పెంచడం, పాత తోటల పునరుద్ధరణ, నాణ్యమైన కూరగాయల నారు సరఫరా, రక్షిత సాగు, యాంత్రికరణ, కోల్డ్ స్టోరేజ్ లు, రైపనింగ్ చాంబర్స్, రీఫర్ వ్యాన్స్, రైతులకు కొత్త సాంకేతికత, యాజమాన్య పద్ధతుల పై శిక్షణ ఇవ్వడం మొదలగునవి ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఈ పథకంలోని ఉప పథకాల కింద ఉన్న రాయితీ నిబంధనలు అనుసరించి రైతులకు 30-100% రాయితీ అందించబడుతుంది. రాష్ట్ర ఏర్పాటు తర్వాత మన జిల్లాలో పండ్లతోట విస్తీర్ణత మరియు కూరగాయల సాగు 3048.98 ఎకరాలు, మల్చింగ్ 41515 ఎకరాలు, నీటి కుంటలు 122 యూనిట్లు యాంత్రీకరణ 271 యూనిట్లు, ప్యాక్ హౌస్ 29 యూనిట్లు, 6 కోల్డ్ స్టోరేజ్ యూనిట్లు వివిధ పథకాలను 13,12 కోట్ల రాయితీ తో అమలు పరచగా 3156 మంది రైతులు లబ్ది పొందారున్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి తులసి, జిల్లా డిసిసిబి అధ్యక్షుడు కృష్ణారెడ్డి, ఎంపీపీ విజయలక్ష్మీ రమణారెడ్డి, జెడ్పిటిసి మాలతి కృష్ణారెడ్డి, గ్రామ సర్పంచ్ లక్ష్మీ నర్సింహులు, ఎంపిటిసిలు యాదమ్మ, నారాయణ, మండల బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పెద్దోళ్ల ప్రభాకర్, భారత యువజన నాయకుడు శేఖర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మిట్ట వెంకటరంగారెడ్డి, మండలంలోని గ్రామాల రైతలు, మరియు గ్రామ పెద్దలు తదితరులు పాల్గన్నారు.