Wednesday, 4 November 2026

హుజూర్ నగర్ ఏరియా హాస్పిటల్ కు కాయకల్ప అవార్డు

హుజూర్ నగర్ జూన్ 3 (జనంసాక్షి): పట్టణంలోని ఏరియా హాస్పిటల్ కు కాయకల్ప అవార్డు దక్కిందని హాస్పిటల్ సూపర్డెంట్ కరుణ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం ఆయన తెలిపిన ప్రకటనలో జాతీయ ఆరోగ్య మిషన్ , రాష్ట్ర ప్రభుత్వం సంయుక్త ఆధ్వర్యంలో అందజేసే కాయకల్ప అవార్డుల్లో హుజూర్ న గర్ ఏరియా ఆసుపత్రికి 70% స్కోరింగ్ తో మొట్ట మొదటి సారి అవార్డు వచ్చిందని అన్నారు. ఈ అవార్డు హాస్పిటల్ లోని బయో మెడికల్ వేస్టేజి నిర్వహణ, ఇన్ఫెక్షన్ సోకకుండా తీసుకుంటున్న జాగ్రత్తలు, పారిశుద్ధ్యం , రికార్డుల నమోదు, సిబ్బంది పనితీరు తదితర అంశాలను పరిగణలోకి తీసుకుందన్నారు. జాతీయ ఆరోగ్య మిషన్ బృందం ఫిబ్రవరి నెలలో హాస్పిటల్ పర్యవేక్షించి స్కోరింగ్ ఇచ్చిందని అన్నారు. వైద్యులు, సిబ్బంది సమిష్టి కృషితోనే ఈ గుర్తింపు లభించిందని తెలిపారు. అవార్డు పొందడంపై హాస్పిటల్స్ సిబ్బంది సంతోషం వ్యక్తం చేశారు.