విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిఆత్మకూర్(ఎం) జనవరి 28 (జనంసాక్షి) మండల కేంద్రంలో బీజేపీ కార్యాలయంలో బీజేపీ పార్టీ మండల అధ్యక్షుడు తడిసిన మల్లారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పాల్గొన్న బీజేపీ మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వారు మాట్లాడుతూ తాను గతంలో ఎంపీ గా ఉన్నపుడు చేసిన అభివృద్ధి బునదిగాని కాలువ పనులు తన హయాంలో చేసినవే ఈ ప్రభుత్వం వచ్చాక తట్టెడు మట్టి ఎట్టలేదని అన్నారు గత మూడు సంవత్సరాలుగా రోడ్డు పనులు నత్త నడకన సాగుతున్నాయని విమర్శించారు గవర్నర్ పై అధికార పార్టీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటని ఒక మహిళపై కౌశిక్ రెడ్డి చేసిన మాటలు అత్యంత హీనమని ఆయన మాట్లాడిన ప్రతి మాట ప్రగతి భవన్ డైరెక్షన్ లో నుండి వచ్చినవే అని అన్నారుఆత్మకూరు బీజేపీ కార్యకర్తల ఉత్సహం చూస్తే రాబోయే రోజుల్లో ఆలేరు లో తప్పకుండా బీజేపీ జెండా ఎగరడం ఖాయమని తెలంగాణ లో బీజేపీ ప్రభుత్వం వస్తున్నదని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కిసాన్ మోర్చా నాయకులు బొట్టు అబ్బయ్య మాజీ పార్లమెంట్ కోకన్వీనర్ తుమ్మల మురళీధర్ రెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యులు కాశీ నాథ్ జిల్లా నాయకులు ఇంద్ర రెడ్డి యువ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి కుమార్ జిల్లా యువ అధికార ప్రతినిధి నరేష్ మండల ప్రధాన కార్యదర్శి ఎం భిక్షపతి మాజీ మండల పార్టీ అధ్యక్షులు బి సత్యనారాయణ ఆత్మకూరు టౌన్ అధ్యక్షులు ఎల్ వెంకటయ్య కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు ఎస్ నర్సింహారెడ్డి యువ మోర్చా మండల అధ్యక్షులు పి రవీందర్ ఇతర ముఖ్య మండల వివిధ మోర్చాల బూత్ అధ్యక్షులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు




