Tuesday, 3 November 2026

శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామి నూతన విగ్రహ, ధ్వజస్తంభ,ఆలయ పునఃప్రతిష్టా మహోత్సవంలో పాల్గొన్న దేవరకొండ కాంగ్రెస్ నాయకులు

 

 

 

 

 

 

కేతావత్ భీల్యా నాయక్కొండముల్లేపల్లి జనవరి 28 (జనంసాక్షి) న్యూస్ :
దేవరకొండ నియోజకవర్గం డిండి మండల పరిధిలో చేరుకుపల్లి గ్రామంలొ ఏర్పాటు చేసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి నూతన విగ్రహ ధ్వజస్తంభ ఆలయ పునఃప్రతిష్టా మహోత్సవంలొ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు అనంతరం ప్రజా నేత కేతావత్ బీల్యా నాయక్ మాట్లాడుతూ ప్రజలపై వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ప్రజలందరు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో మెలగాలని అన్నారు మరియు దేవాలయానికి నా వంతు సహాయసహకారాలు వుంటాయని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ రవి నాయక్, నేనావత్ కిషన్ నాయక్, స్థానిక సర్పంచ్ సుధారాణి వెంకట్ రెడ్డి, వెంకటరమణారెడ్డి,సుమిత్ రెడ్డి, కొర్ర రవి, మునావత్ శంకర్ నాయక్,రాత్లావత్ లాలు తిరుపతి రెడ్డి ,లక్ష్మమ్మ ,హరి నాయక్, మోతిలాల్, యువజన కాంగ్రెస్ నాయకులు కిరణ్ నాయక్, గడిగ లింగం గౌడ్, మోహన్, జైపాల్ నాయక్, నాగార్జున, సీతా నాయక్, గ్రామ మరియు పరిసర ప్రాంత ప్రజలు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు