ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ ఆధ్వర్యంలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవo రిటైర్డ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రాజారావు
కొండమల్లేపల్లి నవంబర్ 26 జనం సాక్షి న్యూస్ :
1949 నవంబర్ 26 రాజ్యాంగాన్ని ఆమోదించిన దినాన్ని గుర్తుగా నేడు భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఆల్ ఇండియా సమత సైనిక్ దళ్ ఆధ్వర్యంలో దేవరకొండ పట్టణంలోని ఐ.బి నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అంబేద్కర్ రాజ్యాంగ రచనకు చేసినటువంటి సేవలను కొనియాడారు, రాజ్యాంగం ద్వారా ప్రజలకు కల్పించబడిన హక్కులతో ప్రజలందరికీ సమాన న్యాయం జరగాలని కోరారు భారతదేశంలో అత్యున్నతమైనది రాజ్యాంగమే అని అన్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బుర్రి వెంకన్న , నల్గొండ జిల్లా అధ్యక్షులు మద్దిమడుగు బిక్షపతి, జిల్లా సలహాదారులు యేకుల రాజారావు, కంబాలపల్లి వెంకటయ్య, జిల్లా ఉపాధ్యక్షులు యేకుల సురేష్, దేవరకొండ నియోజకవర్గ అధ్యక్షులు ధర్మపురం శ్రీను, మేడ సైదులు, కొండమల్లేపల్లి అధ్యక్షులు గోపాల్, పంది శ్రీను, ఎల్లయ్య, ఎర్ర ఆంజనేయులు, రాజు, రమేష్, శేఖర్, నరసింహ, వెంకటయ్య , సింగం వెంకటేష్ ముత్యాలు తదితరులు పాల్గొన్నారు.
ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ ఆధ్వర్యంలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవo




