సమాన హక్కులను కల్పించిన మహనీయుడు డా.బిఆర్ అంబేడ్కర్.
తెలంగాణ దండోరా పార్లమెంట్ ఇంచార్జీ మంతటి గోపి మాదిగ.
అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన దండోరా నాయకులు.
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, నవంబర్26(జనంసాక్షి):
73వ భారత రాజ్యాంగ దినోత్సవాన్ని జిల్లా కేంద్రంలో తెలంగాణ దండోరా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా దండోరా నాయకులు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలు వేశారు. ఈ సందర్భంగా తెలంగాణ దండోరా రాష్ట్ర యువసేన అధ్యక్షులు సుక్క వెంకట్ స్వామి,తెలంగాణ దండోరా నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఇంచార్జీ మంతటి గోపి మాదిగ. మాట్లాడుతూ 2 సంవత్సరాల 11 నెలలు 18 రోజులు12 మందితో ముసాయిదా కమిటీని ఏర్పాటు చేసుకుని ముందుచూపు తో వచ్చే తరాలకు ఉపయోగపడేలా మన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్రి పురుష బేధం లేకుండా అందరికీ సమాన హక్కులు కల్పించిన మహనీయుడు అని అన్నారు. ముందు తరాలు ఇబ్బంది పడకూడదనే ముందు చూపుతో రచించిన రాజ్యాంగాన్ని కొందరు తప్పుడు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంబేద్కర్ అవసరమైతే మార్పులు చేసుకోమని మాత్రమే తెలిపారని అన్నారు. రాజ్యాంగాన్ని తిరిగి రాయాలనే ఆలోచన లకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. మహనీయుల అడుగుజాడలో నడవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ దండోరా జిల్లా మహిళా అధ్యక్షురాలు బాకి రేణుక మాదిగ, నాయకులు పాదాల శేఖర్, సాయిబాబు, రాము,రామకృష్ణ,తదితరులు పాల్గొన్నారు.




