ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ నల్గొండ జిల్లా శాఖ ఆధ్వర్యంలో సావిత్రి బాయి పూలే జయంతి వేడుక
కొండమల్లేపల్లి జనవరి 3 జనం సాక్షి న్యూస్ :
నేడు ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ నల్గొండ జిల్లా శాఖ ఆధ్వర్యంలో దేవరకొండ నియోజకవర్గం కొండమలేపల్లి లోని అంబేద్కర్ విగ్రహం వద్ద సావిత్రి బాయి పూలే 192 వ జయంతి వేడుకలు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతు నిమ్న వర్గాల అభ్యున్నతికి కృషి చేసి కుల, మత భేదాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించిన ప్రేమస్వరూపిణి, ఆధునిక విద్య ద్వారానే స్త్రీ విముక్తి సాధ్యపడుతుందని నమ్మి తన భర్త మహాత్మ జ్యోతిరావు పూలే తో కలసి 1848 జనవరి 1న పూణేలో మొట్టమొదటగా బాలికల పాఠశాలను ప్రారంభించిందన్నారు. మహిళల సకల హక్కుల కోసం, నూతన వ్యవస్థ కోసం, ప్రాణాల్ని సైతం పణంగా పెట్టి సమష్టిగా పోరాటం చేసిందన్నారు . ఆమె ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు, పీడిత ప్రజలు ముఖ్యంగా స్త్రీల విద్యాభివృద్ధికి కృషి చేసిన తొలితరం మహిళా ఉద్యమకారిణి. సావిత్రిబాయి పూలే అన్ని కొనియాడారు. ఈ కార్యక్రమం లో జిల్లా నాయకులు గంజి శ్రీనివాస్, అందుగుల లక్ష్మినారాయణ,ఆడెపు సతీష్, కొండమల్లే పల్లి మండల కన్వీనర్ గోపాల్, గుర్రంపుడ్ మండల కన్వీనర్ అందుగుల పరమేష్, అజేయ్, సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.




