ప్రేమ పెళ్లి విఫలమై యువతి ఆత్మహత్య తూప్రాన్ జనం సాక్షి జనవరి 3:: ప్రేమించి పెళ్లి చేసుకుని వారం రోజులు కాపురం చేసి పారిపోయిన భర్తతో కాపురం నిలబెట్టాలని పోలీసులను ఆశ్రయించిన యువతికి న్యాయం జరగకపోవడంతో మనస్థాపానికి గురై గుళికల మందు సేవించగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించడంతో మనోహరాబాద్ మండలం దమ్మక్క పల్లి గ్రామంలో ఉద్రిక్తత చేసు కొంది మనోహరాబాద్ మండలం ధమక్కపల్లి గ్రామానికి చెందిన యశ్వంత్ రెడ్డి అదే గ్రామానికి చెందిన తేజశ్రీ లు ప్రేమించకు కొని మూడు నెలల క్రితం పెళ్లి చేసుకొని తూప్రాన్ లో కాపురం పెట్టారు తమ కూతురు కనిపించడం లేదని తేజశ్రీ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా తాము పెళ్లి చేసుకున్నామని వేరే కాపురం ఉంటున్నామని పోలీసులకు యశ్వంత్ రెడ్డి వివరించారు వారం రోజులు కాపురం తర్వాత యశ్వంత్ రెడ్డి తేజశ్రీకి చెప్పకుండా పరారయ్యారు భర్త రాకపోవడంతో తేజశ్రీ తూప్రాన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు యశ్వంత్ రెడ్డి పై మరియు కుటుంబీకులపై మూడు నెలల క్రితం కేసు నమోదు చేశారు ఇద్దరు ప్రేమించుకున్న విషయం అంతట వ్యాపించడంతో యశ్వంత్ రెడ్డితో జరిపిన చర్చలు విఫలం కావడంతో తీవ్రమణస్థాపానికి గురైన తేజశ్రీ నవంబర్ 18న గుళికల మందు సేవించి ఆత్మహత్య యత్నం చేసుకుంది ఆసుపత్రిలో చికిత్స పొందుతు వారం క్రితం ఇంటికి వచ్చింది గులకల మందు వికటించడంతో సోమవారం తీవ్ర అస్వస్థతకు గురికాగా ఆసుపత్రికి తీసుకువెళ్లగా చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం చనిపోయింది మూడు నెలలు అయినా యశ్వంత్ రెడ్డిని అరెస్టు చేయకపోవడంతో కుటుంబీకులు గ్రామస్తులు ముదిరాజ్ సంఘం నాయకులు ఆగ్రహానికి గురై యశ్వంత్ రెడ్డికి చెందిన స్థలంలో తేజశ్రీ శవాన్ని ఉంచి అక్కడే దహనం చేస్తామని కుటుంబీకులు బంధువులు బైఠాయించారు విషయం తెలుసుకున్న పోలీసులు రంగ ప్రవేశం చేసి యశ్వంత్ రెడ్డ నీ సాయంత్రం అదుపులోకి ఉన్నాడని పోలీసులు తెలిపారు ముఖ్యమంత్రి నియోజకవర్గం లో బీసీ మహిళలకు అన్యాయం జరిగిందని తాము తీవ్ర మనస్థాపానికి గురయ్యామని కనీసం ఏ నాయకుడు కూడా పరామర్శకు కానీ కుటుంబీకులకు అండగా గాని రాలేదని ముదిరాజ్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కృష్ణస్వామి గణేష్ టెంపుల్ చైర్మన్ పిట్ల నాగేష్ నాచారం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ కొట్టాల యాదగిరి మనోహరాబాద్ ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు నరేష్ నర్సింలు రాజులు చంద్రశేఖర్ బిక్షపతి ముదిరాజ్ సంఘ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ అరెస్టు చేసేంతవరకు శవాన్ని తీసేది లేదని బైఠాయించారు ఈ సందర్భంగా గ్రామంలో చోటు చేసుకుంది మంగళవారం సాయంత్రం యశ్వంత్ రెడ్డిని పోలీసులు అదుపులో ఉన్నాడని సీఐ శ్రీధర్ తెలపడంతో తేజశ్రీ దహన సంస్కారాలు కుటుంబీకులు గ్రామస్తులు నిర్వహించారు
ప్రేమ పెళ్లి విఫలమై యువతి ఆత్మహత్య తూప్రాన్




