వంద కోట్ల ప్రభుత్వ భూములను కాపాడాలి – ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్ జనవరి 3 (జనంసాక్షి): హుజూర్ నగర్ నియోజకవర్గంలో కబ్జాకు గురైన 100 కోట్ల ప్రభుత్వ భూములను కాపాడాలని మాజీ టీపీసీసీ అధ్యక్షులు, నల్లగొండ ఎంపీ నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. మంగళవారం హుజూర్ నగర్ పట్టణంలోని ఉత్తమ్ కుమార్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో మఠంపల్లి నుండి మట్టపల్లి వెళ్లే రహదారిలో 46 ఎకరాల భూమి కబ్జా చేశారన్నారు. గతంలో ప్రభుత్వ అధికారులు ఇది ప్రభుత్వ భూమి అని బోర్డు పెట్టినప్పటికీ ఆ బోర్డును తీసివేసి కబ్జాకు పాల్పడ్డారన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాలకు సంబంధించి ఉపయోగించే 100 కోట్ల విలువైన భూమిని ఇలా కబ్జాలకు పాల్పడడం అన్యాయమన్నారు. దోపిడీ వ్యవస్థ నడుస్తుందన్నారు. ఈ విషయంపై కలెక్టర్ హేమంత్ పాటిల్ కేశవ్, జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి కి లేఖ రాయడం జరిగిందన్నారు. హుజూర్ నగర్ లో 6 తారీఖున ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పర్యటన ఉన్న నేపథ్యంలో ఈ విషయాన్ని ప్రస్తావిస్తాన్నారు. ఆర్డీవో వెంకా రెడ్డి ఈ విషయంలో నాకు పోలీసులు సహకరించడం లేదన్నారు. దీనిపై కలెక్టర్ కు ఏ విధమైన ఒత్తిళ్లు ఉన్నాయో ప్రజలు ఆలోచన చేయాలన్నారు. హుజూర్ నగర్ మున్సిపాలిటీలో వీ పి ఆర్ లేఔట్ స్థలాలకు సంబంధించి 3000 గజాల స్థలం పత్రాలు దొంగతనానికి గురయ్యాయి అని ఆరోపించారు. 100 కోట్ల ఆస్తులు కబ్జాకు గురయ్యాయి అన్నారు. వాటిని వెంటనే రికవరీ చేయాలన్నారు. మున్సిపాలిటీలో రివ్యూ నిర్వహించాలన్నారు. ప్రజలంతా వీటిని గమనిస్తున్నారన్నారు. కమిషనర్ సంతకం ఫోర్జరీ చేస్తే పోలీసులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోవడం లేదన్నారు. వెంటనే సంబంధిత విషయాలపై విచారణ జరిపి బాధితులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు తన్నీరు మల్లికార్జున రావు, సాముల శివారెడ్డి, కౌన్సిలర్లు కోతి సంపత్ రెడ్డి, రాజా నాయక్, కోల్లపూడి యోహాన్, సులువ చంద్రశేఖర్, కస్తాల శ్రావణ్, కుక్కడపు మహేష్ తదితరులు పాల్గొన్నారు.
వంద కోట్ల ప్రభుత్వ భూములను కాపాడాలి – ఎంపీ




