ఏర్గట్ల మార్చి 16 (జనంసాక్షి):నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలోని తాళ్లరాంపూర్ గ్రామంలో దొంతుల గంగా మోహన్,శ్రీదేవి దంపతులు గురువారం రోజు ఆవు దూడకు శాశ్రోతంగా పూజలు నిర్వహించి ఆవు దూడకు “జగదాంబగా “నామకరణం చేసి తొట్లే కట్టి బారసాలను అతిథులందరిని పిలిచి భోజనం ఏర్పాట్లు చేసి ఘనంగా నిర్వహించారు. అనంతరం గంగ మోహన్, శ్రీదేవి మాట్లాడుతూ ఆవు మీద ఉన్న ప్రేమతో ఆవుకు శ్రీమంతం కూడా చేశామని, ఇంట్లో బిడ్డల్లాగా దాన్ని కూడా ప్రేమగా పెంచుకుంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వారి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, గ్రామప్రజలు అధిక సంఖ్యలోపాల్గొని వాటిని ఆశీర్వదించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన దంపతులను కూడా ఆశీర్వదించడం జరిగినది.
ఆవు దూడకు నామకరణం చేసిన జంతు ప్రేమికుడు




