ఆశా కార్యకర్తలకు వివిధ అంశాలపై అవగాహన
టేకులపల్లి, డిసెంబర్ 5( జనం సాక్షి): ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సులానగర్ లో ఆశా కార్యకర్తలకు వివిధ అంశాలపై స్థానిక వైద్యాధికారి డాక్టర్ మెంతెన విద్యాసాగర్ అధ్యక్షతన శిక్షణ కార్యక్రమం సోమవారం జరిగింది. ఈ కార్యక్రమంలో గర్భిణీ స్త్రీలలో రక్తహీనతను, పోషకాహారాల లోపాన్ని నివారించడానికి త్వరలో పంపిణీ కానున్న కెసిఆర్ న్యూట్రిషనల్ కిట్ ల గురించి అసాంక్రమిక వ్యాధులైన రక్తపోటు, షుగర్, క్యాన్సర్, థైరాయిడ్ తదితర వ్యాధిగ్రస్తులను గుర్తించడం చికిత్సను అందించడం,మలేరియా వ్యాధిగ్రస్తులను సకాలంలో గుర్తించడం, రేపటినుండి ప్రారంభం కానున్న అనుమానిత కుష్టు వ్యాధిగ్రస్తులను గుర్తించడం, హెచ్ఐవి ఎయిడ్స్ పై ప్రజలలో అవగాహన కల్పించడం, పై వ్యాధులకు సకాలంలో చికిత్స అందించడం, రక్తదానంపై ప్రజలను ప్రోత్సహించడం తదితర అంశాలపై వైద్య సిబ్బందికి,ఆశా కార్యకర్తలకు శిక్షణను ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎన్ సి డి జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ చేతన్ ఎన్ సి డి సూపర్వైజర్ శ్రీకాంత్, కోఆర్డినేటర్ రామ్ ప్రసాద్,పబ్లిక్ హెల్త్ నర్స్ సత్యవతి,సూపర్వైజర్లు వీసం శకుంతల, పోరండ్ల శ్రీనివాస్, నాగు బండి వెంకటేశ్వర్లు,వైద్య సిబ్బంది,ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.




