Thursday, 5 November 2026

కొల్లాపూర్ రూరల్ రిపోర్టర్ కే. సతీష్ కుమార్

జనం సాక్షి:కొల్లాపూర్ రూరల్ రిపోర్టర్ కే. సతీష్ కుమార్
నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండల లో ముఖ్య కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ మంత్రి వర్యులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారు
పెద్ద కొత్తపల్లి మండల కేంద్రంలో ముఖ్య కార్యకర్తలతో సమావేశంలో మాజీ మంత్రి జూపల్లి గారు మాట్లాడుతూ 300 కోట్ల కు పైగా నాలుగు సంవత్సరాల కిందట వివిధ అభివృద్ధి పనుల కొరకై నిధులు మంజూరు చేయిస్తే ఇప్పటి వరకు నిర్లక్ష్యం వహిస్తూ అభివృద్ధి నీ పట్టించుకోని ఎమ్మెల్యే ను ప్రజలే ప్రశ్నించాలి.ఆధారాలతో సహా నియోజకవర్గ ప్రజల ముందుకు మంజూరు చేయించిన ప్రభుత్వ GO ల సమాచారం సోషల్ మీడియా లో ప్రశ్నిస్తే మా వాళ్లపై పోలీస్ లు అక్రమ కేస్ లు పెట్టడం పద్దతి కాదు.నోటీస్ లు ఇవ్వకుండా పోలీస్ లు పిలిచినంత మాత్రాన ఎవరు వెళ్ళవలసిన అవసరం లేదు మా కార్యకర్తలు ఎవరు అసభ్య పదజాలం వాడరు.కేవలం అభివృద్ధిపై మాత్రమే ప్రశ్నిస్తారు. మీకు అండగా నేను ఉన్న అబద్ధాలు చెప్పి ఎన్నికల్లో గెలవాలనే ప్రయత్నం ఎప్పుడు చేయలేదు తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు మూడు సంవత్సరాల అధికారాన్ని మంత్రి పదవిని,ఎమ్మెల్యే పదవిని* వదులుకుని వచ్చాను కార్యకర్తలు ఎవరు అధైర్య పడవద్దు.నాకు కష్ట కాలంలో అండగా ఉన్న ప్రతి కార్యకర్తకు భవిష్యత్తులో అండగా ఉంటా.ప్రజా క్షేత్రంలో పని చేద్దం ప్రజలకు అండగా ఉందం ఈ కార్యక్రమంలో పెద్దకొత్తపల్లి మండల ఎంపీపీ ప్రతాప్ గౌడ్ గారు, మండలంలోని వివిధ గ్రామాల సర్పంచ్ లు, ఎంపీటీసీ లు,ఇతర ప్రస్తుత,మాజీ ప్రజాప్రతినిధులు మరియు జూపల్లి గారి అనుచరులు పాల్గొన్నారు