వ్యాధులు రాకుండా ఉండాలంటే సేంద్రియ ఎరువుతో పంటలు పండించాలి తూప్రాన్ జనం సాక్షి డిసెంబర్ 5:: వ్యాధులు రాకుండా ఉండాలంటే సేంద్రియ ఎరువులతో పంటలను పండించడానికి ప్రతి రైతు ముందుకు రావాలని మనోహరాబాద్ మండల రైతు సమన్వయ సమితి చైర్మన్ సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు ప్రపంచ మృత్తిక దినోత్సవం సందర్భంగా మనోహరాబాద్ కూచారం రైతు వేదికలలో జరిగిన సభలలో ఆయన పాల్గొని ప్రసంగించారు ప్రతి ఒక్కరూ తమ ఇంటి ముందు కనీసం ఐదు కూరగాయాలను సేంద్రియ పద్ధతిలో పెంచడం నేర్చుకుంటే తమ పొలాలలో సేంద్రియ ఎరువులు తో పండించే అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు సేంద్రియ పంటల వల్ల ఎలాంటి వ్యాధులు రావని ఆరోగ్యంగా ఉంటారని మార్కెట్లో సేంద్రీయ ఎరువులతో పండించిన కూరగాయలకు మంచి డిమాండ్ ఉందని భవిష్యత్తులో ఎరువులతో పండించిన పంటలేని ప్రజలు డిమాండ్ చేసి కొంటారని రైతులు రసాయన ఏడుగురులను వాడకం పూర్తిగా తగ్గించి సేంద్రియ ఎరువులను వాడి పంటలు పండించాలని అధిక దిగుబడి వస్తుందని అన్నారు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతి ఒక్కరూ బిఎస్ఎన్ చేయాలని వ్యవసాయం చేసే రైతులకు బీపీ షుగర్ హార్ట్ ఎటాక్ ఎలాంటి వ్యాధులు రావడం లేదన్నారు రైతు ఉదయం తెల్లవారుజామున 5 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు వ్యవసాయ పొలంలో కష్టించి పనిచేసి వ్యవసాయ పనుల్లో నిమగ్నమై అవుతాడని అందువల్ల అతనికి ఎలాంటి వ్యాధులు రాకుండా ఆరోగ్యంగా ఉంటారని అన్నారు ప్రతి రైతుకు తన పొలంలోని నాలుగు స్థలాలలో మట్టిని సేకరించి ఒక దగ్గర కలిపి ఒక భాగం మట్టిని వ్యవసాయ అధికారులకు ఇస్తే వారు పరీక్షలు చేసి ఏఏ మోతాదులో ఎంతెంత ఎరువులు వాడాలనేది చెబుతారని అన్నారు కొందరు రైతులు గతంలో జరిగేవన్నీ కొన్ని సంవత్సరాల నుండి సాయిల్ టెస్టులు నిర్వహించడం లేదని ఈ సందర్భంగా ఆయనకు తెలియజేశారు ఈ విషయంపై ఆయన చెబుతూ మండలానికి ఒకటి సాయిల్ టెస్ట్ కేంద్రం గతంలో ఉండేదని దానికి సంబంధించిన కెమికల్స్ రాకపోవడంతో సాల్టేస్తులు అధికారులు నిర్వహించడం లేదని ఈ విషయంపై అధికారులకు ప్రభుత్వానికి తెలియజేస్తానని ఆయన తెలిపారు ఈ సందర్భంగా ఎంపీపీ నవనీత రవి మాట్లాడుతూ రైతులు ఈ సంవత్సరం జిల్లాలో అత్యధిక పంటను పండించడంతో రాష్ట్రంలో మెదక్ జిల్లా వరి ధాన్యం సేకరణ రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉందని ఆమె అన్నారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి రాజశేఖర్ సహాయ వ్యవసాయ అధికారి సచిన్ ఉప సర్పంచ్ వెంకట్ గౌడ్ మాజీ సర్పంచ్ విట్టల్ ఆత్మ డైరెక్టర్ బిక్షపతి టిఆర్ఎస్ నాయకులు కృష్ణ గౌడ్ కోఆర్డినేటర్ బిక్షపతి తదితరులు పాల్గొన్నారు
వ్యాధులు రాకుండా ఉండాలంటే సేంద్రియ ఎరువుతో పంటలు పండించాలి




