యదద్రి జిల్లా తుర్కపల్లి మండలం జనంసాక్షి న్యూస్
ఫిబ్రవరి 06.తుర్కపల్లి మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తుర్కపల్లిలోని 108 వాహనం, గర్భిణీ స్త్రీలను ఇంటి నుండి ఆసుపత్రికి తరలించేటప్పుడు 108 సేవలను తప్పనిసరిగా వినియోగించుకోవాలని ఆశా కార్యకర్తలకు సూచించడం జరిగింది. ఆషా ‘డే ‘సందర్భంగా తుర్కపల్లి మండలం , బొమ్మలరామారం మండలం రెండు మండలాలకు కాను ప్రజలకు మెరుగైన చికిత్సను అందిస్తూ ఆస్పత్రికి తరలిస్తున్నారు. కావున రెండు మండలాలకు సంబంధించిన ప్రజలు 108 కు కాల్ చేసి సేవలను వినియోగించుకోవాల్సిందిగా 108 సిబ్బంది సేవలను వినియోగించుకోవడం వలన కలిగే లాభాల గురించి వివరంగా చెప్పడం జరిగింది .ఆటోలో, కార్లలో ప్రయాణించడం వలన కాన్పు సమయంలో నొప్పులు వచ్చినప్పుడు శ్రేయస్కరం కాదు అని ఒకవేళ అంబులెన్స్ లో కాన్పు నిర్వహించాల్సి వస్తే మెడికల్ సిబ్బంది ఉంటారు కాబట్టి తల్లికి బిడ్డకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అంబులెన్స్ లోనే కానుపు చేయడం జరుగుతుంది. అంబులెన్స్ లో డెలివరీ కిట్టు అనేది ఉంటుంది డెలివరీ చేయడం వలన శిశువు యొక్క శుభ్రతకు కూడా మంచిగా ఉంటుంది. 108 కి అత్యవసర సమయంలో ఎప్పుడైనా ఫోన్ చేయవచ్చు గర్భిణీ స్త్రీలను తరలించడమే కాకుండా రోడ్డు ప్రమాదాలు ,చాతి నొప్పి ఆత్మహత్యలు, చేసుకున్నప్పుడు, పాముకాటుకు గురైనప్పుడు మరి ఏ ఇతర సమస్యలకైనా ఫోన్ చేయవచ్చును కావున ప్రతి ఒక్కరూ మీయొక్క గ్రామంలో ఉండే 108 సేవలను సద్వినియోగ పరుచుకోవాలని 108 తప్పనిసరిగా వినియోగించుకోవలసిందిగా తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సి హెచ్ ఓ రాజయ్య , మరియు స్టాఫ్ నర్సులు ఆశా కార్యకర్తలు 108 సిబ్బంది ఈఎంటి రాకేష్ ,పైలట్ ఎల్లా స్వామి పాల్గొనడం జరిగింది.




