Tuesday, 3 November 2026

ప్రవేట్ పాఠశాలల దోపిడీ పట్టించుకునే వారే లేరు

 

 

 

 

 

 

 

 

 

గద్వాల నడిగడ్డ, ఫిబ్రవరి 6 (జనం సాక్షి);
తెలంగాణ రాష్ట్ర రాజధానికి ఈసిరేసినట్లుగా జోగులాంబ గద్వాల జిల్లా నడిగడ్డ ప్రాంతమైన అలంపూర్ గద్వాల తాలూకాలలో ప్రైవేటు స్కూల్ యజమానులు విద్యార్థుల తల్లిదండ్రుల నుండి ఫీజుల పేరుతో జలగల పిడిస్తున ప్రభుత్వ యంత్రాంగం, జిల్లా విద్యాశాఖ అధికారి, ఇటీవల బాధ్యత తీసుకున్న అసిస్టెంట్ కలెక్టర్ గాని ప్రైవేటు పాఠశాలల దోపిడి వైపు చూడకపోవడంతో వారు ఇష్టం వచ్చినట్లు ఫీజులు వసూలు చేస్తున్నారని విద్యార్థినీ విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.జిల్లాలోని ఐజ పట్టణం లో వెలసిన శ్రీ కృష్ణవేణి స్కూల్ యజమాన్యం బి. కె. సురేష్ అనే జర్నలిస్టు పిల్లల నుండి పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు 125 రూపాయలు వసూలు చేయాలి కానీ , 10 వ తరగతి ఫీజు పేరుతో 1000 రూపాయలు, చేతి వ్రాతకు ఫీజు అని 1000 రూపాయలు ప్రత్యేక ఫీజు పేరుతో సమాజంలో ఒక విలువైన జర్నలిస్టుగా ఉన్న వ్యక్తి నుండి ఈ విధంగా ఫీజులు వసూలు చేసి మీ ఇష్టం ఉన్న వాళ్ళకి ఫిర్యాదు చేయండి అని బహుటంగా చెప్పిన, వారిని ఎవరు పట్టించుకోవడంలేదని ఈ విషయాన్ని ఐజ ఎంఈఓ నరసింహులు, డీఈవో సిరాజుద్దీన్ కు ఫిర్యాదు చేసిన వారు అంటి ముట్టనట్లు ఉన్నట్లు తెలుస్తుంది. గతంలో ఈ స్కూల్ యజమాన్యం సైన్స్ ఫేర్ కు సంబంధించి తమ బిల్డింగును ప్రభుత్వం వాడుకుందని, తమనెవ్వరు ఏమి చేయలేరని తమ చెప్పు చేతుల్లో అధికారులు ఉన్నారని వారి పోకడలకు ఎదురు కళ్లెం చేసే నాథుడే లేడని, ఇలానే జోగులాంబ గద్వాల జిల్లాలో ఉన్న పాఠశాలల్లో ఇదే తంతు నడుస్తున్న ఏ అధికారి కూడా వారిని అడిగిన పాపాన పోలేదని ఈ విషయంపై జిల్లా కలెక్టర్ స్పందించి విద్యార్థినీ, విద్యార్థుల తల్లిదండ్రులను ఫీజు నెపంతో వేధిస్తున్న ప్రైవేట్ స్కూళ్లపై చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.