కోటగిరి ఫిబ్రవరి 6 జనం సాక్షి:-కోటగిరి మండల కేంద్రంలోని పోస్ట్ ఆఫీస్ ప్రాంగణంలో సోమవారం వైఎస్ఆర్టిపి నాయకులు పెన్షన్‌దారులకు అల్పాహారం పంపిణీ చేశారు.ఈ సందర్భంగా వైఎస్ఆర్టిపి మండల అధ్యక్షులు తోట సుధాకర్ మాట్లాడుతూ. సేవా దృక్పథంలో భాగంగా మండల కేంద్రంలోని పెన్షన్‌దారులు పడుతున్న ఇబ్బందులు, అవస్థలను చూసి చలించి ఈ అల్ఫాహార కార్యక్రమం నిర్వహించామని అన్నారు. రానున్న రోజుల్లో వైఎస్ఆర్టిపి అధినాయకురాలు వైఎస్ షర్మిల సహకారంతో మరిన్ని సేవా కార్యక్రమాలు ఉమ్మడి మండలాల వ్యాప్తంగా చేపడుతామని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మోస్రా మండల నాయకులు మహేష్,డా.మధు, నరేష్ యాదవ్,గంగాధర్, తదితరులు పాల్గొన్నారు




