ఆశ తో రాలేదు ఆశయం కోసం వచ్చా
-జంగం గోపి
జహీరాబాద్ జనవరి 10( జనం సాక్షి) ఆశతో రాలేదు ఆశయం కోసం నేను వచ్చాను అని పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న నా యొక్క ఎదుగుదలను ఒర్వలేక కొందరు బిజెపి నాయకులు బిఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులతో కుమ్మక్కై ఇటువంటి కుట్ర పూరిత రాజకీయానికి ఒడిగట్టారని జంగం గోపి అన్నారు.మంగళవారం జహీరాబాద్ పట్టణములోని తమ నివాస గృహంలో 2018 బీజేపీ ఎన్నికలలో ఎమ్మెల్యే అభ్యర్థి గా పోటీ చేసిన జంగం గోపి ఇటివల పార్టీ నుండి సస్పెన్షన్ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు బిజెపి రాష్ట్ర నాయకత్వం నన్ను సస్పెండ్ చేస్తూ తీసుకున్న నిర్ణయం ఎటువంటి అంశాలు పరిగణలోకి తీసుకున్నారో తెలియలేదని కనీసం నా వాదనను కుడా వినలేదని ఆవేదన వ్యక్తం చేశారు . వాస్తవంగా ఝరాసంగం మండలంలోని బర్దిపూర్ గ్రామంలో నిర్వహించిన ప్రజాగోస – బీజేపీ భరోసా కార్యక్రమంలో బిజెపి జిల్లా అద్యక్షుడు నరేందర్ రెడ్డి తో ప్రోటోకాల్ విషయంలో వాగ్వివాదం మాత్రమే చోటు చేసుకుందని, ఎవరిపైన ఎటువంటి దాడి జరగలేదని తెలిపారు . ఝరాసంఘం అధ్యక్షుడు బి . అడవన్న, ఇటీవలే బిఆర్ఎస్ నుంచి బీజేపీలోకి చేరిన చింతల్ ఘాట్ సుధీర్ కుమార్ పై దాడి చేసిన ఆరోపణలతో పార్టీ నుంచి తొలగించినట్లు ప్రకటిస్తూ లేఖను జారీ చేశారే కానీ అట్టి లేఖ నాకు ఇంతవరకు అందలేదని వారు తెలిపారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న నా యొక్క ఎదుగుదలను ఒర్వలేక కొందరు బిఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులతో కుమ్మక్కై ఇటువంటి కుట్ర పూరిత రాజకీయానికి ఒడిగట్టారని వారన్నారు .ఈ కార్యక్రమములో ఆయా మండలానికి చెందిన బిజెపి నాయకులు ,కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆశ తో రాలేదు ఆశయం కోసం వచ్చా -జంగం గోపి




