గ్రాంట్స్ పై ప్రధానోపాధ్యాయులకు అవగాహన కార్యక్రమం నిర్వహించిన జిల్లా అకడమిక్ అధికారి మాలోతు సారయ్య
జనం సాక్షి, చెన్నారావుపేట
మండలంలోని ఎం.ఆర్.సి కార్యాలయంలో మండల విద్యాశాఖాధికారి రత్నమాల అధ్యక్షతన పాఠశాల గ్రాంట్స్ పై ప్రధానోపాధ్యాయులకు అవగాహన కార్యక్రమం ను నిర్వహించారు.ఈ కార్యక్రమం నకు ముఖ్యఅతిథిగా జిల్లా అకడమిక్ మానీటరింగ్ అధికారి మాలోతు సారయ్య హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో పాఠశాల గ్రాంట్స్ పి.ఎఫ్.ఎం.ఎస్ అకౌంట్స్ యాక్టివేషన్,నిధుల వినియోగం వివరాలు పై ప్రధానోపాధ్యాయులు కు పూర్తిగా వివరించారు.పాఠశాల గ్రాంట్స్ ను ప్రధానోపాధ్యాయులు, ఎస్.ఎం.సి చైర్మన్ ల జాయింట్ అకౌంట్ ద్వారా పిఎఫ్ఎంఎస్ సైట్ లో యాక్టివేషన్ చేసిన విధంగా పాఠశాల గ్రాంట్స్ ను పాఠశాల వినియోగంనకు ఖర్చు చేయవలసి ఉందని తెలిపారు.అందరూ ప్రధానోపాధ్యాయులు సమయపాలన పాటిస్తూ అబాస్ ద్వారా బయోమెట్రిక్ హాజరు ను నమోదు చేసి లీవ్ లో ఉంటే ముందస్తుగా కాంప్లెక్స్ హెడ్మాస్టర్ లకు సమాచారం ను అందించాలని తెలిపారు.పాఠశాల నిధుల వినియోగం పై జిల్లా సిస్టం అనాలిస్ట్ చేరాలు, ప్రధానోపాధ్యాయులు కు ప్రొజెక్టర్ ద్వారా పూర్తిగా వివరించారు.ఈ కార్యక్రమంలో ఎం.ఈ.ఓ.రత్నమాల ,సిస్టమ్ అనాలిస్ట్ చేరాలు ,తొలిమెట్టు నోడల్ ఆఫీసర్ ఫ్లోరెన్స్,కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు సరళ, రజిని,ప్రధానోపాధ్యాయులు మోహనరావు,కృష్ణమూర్తి,ప్రసన్న లక్మి, జ్యోతి,రిసోర్సు పర్సన్ స్వప్న, ప్రధానోపాధ్యాయులు భద్రయ్య, రవీందర్ రెడ్డి,ఇంద్రయ్య,కొమురయ్య,మల్లయ్య,రియాజుద్దీన్ కట్టస్వామి,ఈర్యా,పవన కుమారి,హామీదా బాను,ఎల్లయ్య,రవి,కుమారస్వామి,యాకయ్య, దసృ,ఎం.ఆర్.సి సిబ్బంది అశోక్, సీఆర్పీ లు తదితరులు పాల్గొన్నారు.




