ఆసరా” లోపాలు అరికట్టాలి, ప్రతినెల పింఛన్ ఇవ్వాలి
ఏ.ఐ.టి.యు.సి జిల్లా అధ్యక్షులు కే. శ్రీరామ్
పానుగల్ నవంబర్ 24, జనంసాక్షి
ఆసరా లోపాలను అరికట్టి, అర్హులందరికీ పింఛన్ ఇవ్వాలని ఏ.ఐ.టి.యు.సి జిల్లా అధ్యక్షులు కే. శ్రీరామ్ డిమాండ్ చేశారు. గురువారం కేతేపల్లి ఆసరా పింఛన్ల పంపిణీ కేంద్రం (పోస్ట్ ఆఫీస్) వద్ద సిపిఐ, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కార్యాలయం ముందు బైఠాయించి ఆసరా లబ్ధిదారులతో కలిసి ధర్నా నిర్వహించారు. అనంతరం బస్టాండులో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కే శ్రీరామ్ మాట్లాడుతూ ప్రతి నెల ఇవ్వాల్సిన పెన్షన్ పంపిణీలో నెలల తరబడి జాప్యం ఒక లోపం అన్నారు ప్రతినెల 5వ తేదీ పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు
జిల్లా 14 మండలాల పరిధిలో ప్రతి నెల 14.33 కోట్లు ఆసరా పంపిణీ చేస్తారన్నారు. సెప్టెంబర్, అక్టోబర్ రెండు నెలల పింఛన్ మొత్తం 28 కోట్ల 66 లక్షలని 62, 869 మంది లబ్ధిదారులు పింఛనుకు ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. పంపిణీలో జాప్యం వల్ల కొందరు లబ్ధిదారులు పింఛను డబ్బు నష్టపోతే, ప్రతినెల మందులకు ఆహారానికి డబ్బు అందక ఆరోగ్యం కోల్పోతున్నారని విమర్శించారు. తనకు మూడు నెలల పింఛను రావాల్సి ఉండగా కంప్యూటర్ పై వేలిముద్ర తీసుకొని రెండు నెలలదే ఇచ్చారని ఒక నెల పింఛన్ నష్టపోయానని వృద్ధాప్య పింఛన్ లబ్ధిదారు కేతేపల్లి వడ్ల సంజన్న ఆరోపించారు గతంలో బాలస్వామి అనే మరో లబ్ధిదారు కు కూడా ఇలాగే జరిగిందన్నారు వృద్ధుల మరపును ఆసరాగా తీసుకుంటున్నారని విమర్శించారు వృద్ధులకు, వితంతువులకు రూ.లు 2016 వికలాంగులకు 3016 పంపిణీ చేయాల్సి ఉండగా రౌండ్ ఫిగర్ 2000, 3000 మాత్రమే ఇచ్చి తక్కిన 16 రూపాయలు ఇవ్వటం లేదని చిల్లర సాకు చూపి ఎగవేస్తున్నారని ఆరోపించారు. గట్టిగా అడిగినవారికి పింఛను పాస్ బుక్ పై బాకీ రాస్తున్నారని మరునెల పంపిణీకి కొత్త అధికారి వస్తే 16 బాకీ తనకు తెలియదు అంటున్నారని విమర్శించారు. రౌండ్ ఫిగర్ 2100 కు 3100 కు పెంచితే చిల్లర సమస్య రాదన్నారు. నిత్యవసరాలు మందుల ధరలు విపరీతంగా పెరిగాయని పింఛన్ 2500 3500 కు పెంచాలని డిమాండ్ చేశారు 57 ఏళ్ల వయస్సు వారు పింఛన్‌కు నిర్దేశించిన గడువులోనే ఆన్లైన్లో దరఖాస్తులు చేసినా కేతేపల్లి లో సుమారు 20 మందికి ,తెల్ల రాళ్లపల్లిలో మరికొందరికి మంజూరు కాలేదని, జిల్లాలో గణనీయంగా ఉందన్నారు కొత్త పింఛన్ ప్రొసీడింగులు, కార్డుల పంపిణీ సందర్భంగా కేతేపల్లి, తెల్ల రాళ్లపల్లి లలో ఈ సమస్య జిల్లా కలెక్టర్ ,ఎమ్మెల్యే దృష్టికి తెచ్చిన పరిష్కారం కాలేదన్నారు. మంజూరైన కొందరికి ప్రొసీడింగులు, కార్డులు ఇవ్వలేదని, ఇవ్వాలని డిమాండ్ చేశారు. మూడు ఎకరాల పైగా తరి,7:30 ఎకరాల పైగామెట్ట ఉంటే అనర్హులని నిబంధన కాగా, కేతేపల్లిలో నాలుగు ,ఐదు ఎకరాల మెట్టగల ఇద్దరు వితంతువులకు పెన్షన్ రద్దు చేశారన్నారు. రైతు పట్టా పాస్ బుక్ లలో మెట్ట, తరి వివరాలే లేవని, ఏ ప్రాతిపదికన భూ పరిమితి లెక్కిస్తారని ప్రశ్నించారు. ప్రతినెల కొందరికి 57 ఏళ్ల వయస్సు నిండుతుందని, కొందరు వితంతువులు అవుతారని ప్రతినెల వీరిని గుర్తించి పించను ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి డంగు కురుమయ్య మాజీ కార్యదర్శి తెల్ల రాళ్లపల్లి ఉపసర్పంచ్ బాలస్వామి కేతేపల్లి 12వ వార్డు సభ్యుడు పెంటయ్య సీనియర్ నాయకులు కురువ హనుమంతు మాల కుర్మయ్య చిన్న కురుమయ్య హుస్సేన్ చెన్నయ్య పింఛనుదారులు తదితరులు పాల్గొన్నారు.
ఆసరా” లోపాలు అరికట్టాలి, ప్రతినెల పింఛన్ ఇవ్వాలి




