జర్నలిస్ట్ యూనియన్ బలోపేతానికి కృషి.
టియుడబ్ల్యూజే (హెచ్ 143)
జిల్లా ప్రధాన కార్యదర్శి గుండగోని జయశంకర్ గౌడ్.
కొండమల్లేపల్లి నవంబర్ 24 జనం సాక్షి న్యూస్ :
తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ నేతృత్వంలోని మన రాష్ట్రం- మన యూనియన్ ట్యాగ్ లైన్ తో ఏర్పడిన టియుడబ్ల్యూజే (హెచ్ 143) యూనియన్ బలోపేతానికి కృషి చేయాలని జిల్లా ప్రధాన కార్యదర్శి గుండగోని జయశంకర్ గౌడ్ కోరారు. దేవరకొండ పట్టణంలోని పి పి ఆర్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో టియుడబ్ల్యూజే (హెచ్ -143) సభ్యత స్వీకరణ మహోత్సవం గురువారం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యూనియన్ సభ్యత్వం స్వీకరించిన జర్నలిస్టులకు టియుడబ్ల్యూజే( హెచ్ 143)గుర్తింపు కార్డుతో పాటు రెండు లక్షలు విలువగల గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించడం జరుగుతుందన్నారు. దేవరకొండ నియోజకవర్గం లోని అన్ని మండలాలకు సంబంధించిన దేవరకొండ, కొండమల్లేపల్లి, చందంపేట, నేరేడుగొమ్ము, మాల్, చింతపల్లి, డిండి, పీఏ పల్లి మండలాలలో పనిచేస్తున్న ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు సభ్యత్వాలను స్వీకరించాలని వారు కోరారు. టీయూడబ్ల్యూజే హెచ్143 ఉమ్మడి నల్లగొండ జిల్లా మహాసభ డిసెంబర్ నెలలో నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో TUWJH143 రాష్ట్ర కమిటీ సభ్యులు మామిడి దుర్గాప్రసాద్ చిన్న పత్రికల సంఘం అధ్యక్షుడు వెన్నేమల రమేష్ బాబు జర్నలిస్ట్ యూనియన్ నాయకులు కొమ్మినేని ఆంజనేయులు, సయ్యద్ పాషా, సుభాష్ నారాయణ, సముద్రాల వేణు, షేక్ మొహినుద్దీన్, రాందాస్,తదితరులు పాల్గొన్నారు.
జర్నలిస్ట్ యూనియన్ బలోపేతానికి కృషి




