ఆసుపత్రి మరమ్మతు పనులకు భూమిపూజ
గుడిహత్నూర్ : జనవరి 5( జనం సాక్షి)మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మరమ్మతు పనులను గురువారం బోథ్ శాసనసభ్యులు రాథోడ్ బాపురావు భూమి పూజ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రజలకు నాణ్యమైన ఉష వైద్యం అందించడంతోపాటు మౌలిక వస్తువుల కల్పనకు కృషి చేస్తుందన్నారు అందులో భాగంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వసతుల కల్పనకు 9 లక్షల రూపాయలు నిధులతో మరమ్మత్తు పనులు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు అనంతరం స్థానిక ఉర్దూ ప్రాథమికోన్నత పాఠశాల ను ఆయన సందర్శించారు ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడుతూ పాఠశాలలో విద్యాబోధన గురించి అడిగి తెలుసుకున్నారు పాఠశాలలో నెలకొని ఉన్న సమస్యలను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు ఉపాధ్యాయ సిబ్బంది పూర్తిస్థాయిలో లేకపోవడంతో విద్య బోధనకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని తెలపడంతో ఈ విషయమై జిల్లా విద్యాధికారి ప్రణీతతో ఫోన్లో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని కోరారు ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారులు డా.సాయి ప్రియ,డా.శివ,భారాస మండల కన్వీనర్ కరాడ్ బ్రహ్మానంద్,రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు బూర్ల లక్ష్మీనారాయణ,మండల కో ఆప్షన్ సభ్యుడు జమీర్,ఎంపీటీసీలు




