టీయూడబ్ల్యూజే రాష్ట్ర మహాసభ పోస్టర్ ఆవిష్కరించిన జిల్లా అధ్యక్షుడు జయశంకర్ గౌడ్ కొండమల్లేపల్లి జనవరి 5 జనం సాక్షి న్యూస్ :
ఈనెల 8వ తేదీన హైదరాబాదులో జరిగే టీయూడబ్ల్యూజే 143 రాష్ట్ర మహాసభలను పురస్కరించుకొని పోస్టల్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని గురువారం కొండమల్లేపల్లి మండల కేంద్రంలో గల పాలకేంద్రం లో జిల్లా అధ్యక్షుడు గుండగోని జయశంకర్ గౌడ్ చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. సందర్భంగా ఆయన మాట్లాడుతూజనవరి 8న జరిగే మహాసభలకు దేవరకొండ నియోజకవర్గం నుండి జర్నలిస్టులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి అల్లం నారాయణ నాయకత్వంలో టీయూడబ్ల్యూజే యూనియన్ ముందంజలో ఉందని ఆయన పేర్కొన్నారు.
టియుడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన అనంతరం మొదటిసారి దేవరకొండ నియోజకవర్గం విచ్చేసిన జిల్లా అధ్యక్షుడు గుండగోని జయశంకర్ గౌడ్ ను దేవరకొండ డివిజన్ నాయకులు పూలమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే 143 రాష్ట్ర నాయకులు మామిడి ప్రసాద్, జిల్లా నాయకులు సుధీర్ కుమార్, వెన్నెమల రమేష్ బాబు, మదనా చారి, డివిజన్ నాయకులు, కొమ్మినేని ఆంజనేయులు యాదవ్, సయ్యద్ పాష,సింగం నారాయణ, నంద్యాల వెంకటేశ్వర్లు, బూడిద శ్రీనివాస్ యాదవ్, ధర్మాపురం శ్రీను, బిజిలి లింగం, దర్శనం విష్ణు, వర్కాల పాండు, మేడిపల్లి జంగయ్య, ఖాజా మొహినుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
టీయూడబ్ల్యూజే రాష్ట్ర మహాసభ పోస్టర్ ఆవిష్కరించిన జిల్లా అధ్యక్షుడు




