హెలిప్యాడ్ పనులను పర్యవేక్షించిన కలెక్టర్ హుజూర్ నగర్ జనవరి 5 (జనంసాక్షి): నేడు తెలంగాణ ఐటి మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు హుజూర్ నగర్ నియోజకవర్గ పర్యటన సందర్భంగా గురువారం కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ హెలిప్యాడ్ పనులను పరిశీలించారు. ఈఎస్ఐ ఆసుపత్రి, రామస్వామి గుట్ట వద్ద డబల్ బెడ్ రూమ్ ఇళ్ల పరిశీలన, సభా వేదికను సందర్శించారు. ఉన్నతాధికారులతో మాట్లాడి పనులు అన్ని సిద్ధం చేసి ఉంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ మోహన్ రావు, ఆర్డిఓ వెంకా రెడ్డి, ఆర్ అండ్ బి డి.ఈ మైపాల్ రెడ్డి, ఆర్ అండ్ బి ఈ.ఈ యాకుబ్, డిపిఆర్ఓ రమేష్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
హెలిప్యాడ్ పనులను పర్యవేక్షించిన కలెక్టర్




