బిచ్కుంద మే 28 (జనంసాక్షి)ఆస్తి తగాదాలు ఒకరిని బలిగొన్న సంఘటన కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం సోనాలలో ఆదివారము తెల్లవారుజామున చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే కొన్ని రోజులుగా అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాలు జరుగుతున్నాయి. ఆదివారం తెల్లవారుజామున ఇంట్లో నిద్రిస్తున్న విజయ పటేలును ఆయన అన్న రాజు కత్తితో దారుణంగా హత్య చేశాడు. హత్యకు కారణం ఆస్తి తగాదాలని బిచ్కుంద వలయాధికారి కృష్ణ తెలిపారు.




