రఘునాథపాలెం మే 28 (జనం సాక్షి)రఘునాథ పాలెం గ్రామంలో జరిగిన గిరిజన మండల సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య వీర భధ్రం మాట్లాడుతూజిల్లాలో ఐదు లక్షల పైబడిన గిరిజనుల సంక్షేమం, అభివృద్ధి కొరకు పాలకులు గతం నుంచి ఐటిడిఏ ఏర్పాటు చేస్తామని ఎన్నికల సందర్భంగా వాగ్దానాలు ఇస్తూ విస్మరిస్తున్నయని, ఐటీడీఏ సాధన కై గిరిజన సంఘం నాయకత్వంలో అన్ని సంఘాలను కలుపుకొని ఐక్య ఉద్యమాలు నిర్మించి ఐటిడిఏ సాధిస్తామని తెలిపారు. ఈ సమావేశం కి మండల అధ్యక్షులు గుగులోతు కుమార్ నాయక్ అధ్యక్షతన ఆయన మాట్లాడుతూ పాలేరు, వైరా, ఖమ్మం నియోజకవర్గం పరిధిలో అత్యధిక జనాభా కలిగిన గిరిజనుల అభివృద్ధి కొరకు ఖమ్మంలో ఐటిడిఏ ఏర్పాటు అవసరం ఉందని అధికారులు, అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు గుర్తించాలని కోరారు. భవిష్యత్తులో గిరిజన సంఘాలన్నిటిని ఏకం చేసి ఐటిడిఏ సాధన కొరకు ఐక్యంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఐటిడి సాధిస్తామని అన్నారు. ఉద్యమంలో గిరిజనులు ప్రజా ప్రతినిధులు ఉద్యోగస్తులు నిరుద్యోగులు అందరూ కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో సంఘం జిల్లా సహకార దర్శి భూక్యా శ్రీనివాస్ నాయక్, తేజావత్ కృష్ణ కాంత్ భూక్య కృష్ణ, గుగులోతు హరి, రాములు, ధరావత్ రమేష్ ,బానోతు నాగేశ్వరరావు రాం కోటి తదితరులు పాల్గొన్నారు





