రాజేంద్రనగర్. ఆర్.సి.ఏప్రిల్ 12 (జనం సాక్షి) శంషాబాద్ మున్సిపాలిటీని అన్ని విధాల అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్నారు.రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీలోని దాదాపు మొత్తం 14 వార్డులలో 12 కోట్ల రూపాయల నిధులతో సీసీ రోడ్లు, బిటి రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సైడ్ డ్రైన్ నిర్మాణం పనులకు బుధవారం మున్సిపల్ చైర్ పర్సన్ సుష్మారెడ్డి, వైస్ చైర్మెన్ బండి గోపాల్ యాదవ్ తో కలిసి శంకుస్థాపనలు చేసిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్.ఈ సందర్భంగా మాట్లాడుతూ పోరాడితే తెచ్చుకున్న తెలంగాణలో అభివృద్ధి లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మున్సిపాలిటీల అభివృద్ధి కొరకు పెద్దపీట వేసి ఎన్ని నిధులైన ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. శంషాబాద్ మున్సిపాలిటీ అభివృద్ధి కొరకు కేటీఆర్ సహకారంతో ప్రత్యేకంగా ఇప్పటివరకు 70 కోట్ల రూపాయల నిధులను మందు చేయడం జరిగిందని అన్నారు. ఆ నిధులను మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు చేపట్టి పూర్తిచేస్తే దాదాపు 90% పైగా మౌలిక వసతులు పూర్తి అవుతాయి అన్నారు. బుధవారం 12 కోట్ల నిధులతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం జరిగిందని అన్నారు. మరో 50 కోట్ల ప్రత్యేక నిధులకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని అతి త్వరలో ఆ నిధులతో చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయడం జరుగుతుందన్నారు. మున్సిపాలిటీ అభివృద్ధి కొరకు కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు సమిష్టిగా కృషిచేసి అభివృద్ధిలో పాలుపంచుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బోగేశ్వర్లు, మార్కెట్ కమిటీ చైర్మెన్ వెంకటేష్ గౌడ్,కౌన్సిలర్లు స్రవంతి శ్రీకాంత్ రెడ్డి, పుష్పలత, భారతమ్మ,బండి భాగ్య లక్ష్మి,జహంగీర్ ఖాన్, నజియా అంజద్,మస్రత్ జాన్ తాజ్ బాబా, అజయ్,శ్రీకాంత్ యాదవ్,లావణ్య శ్రీనివాస్ గౌడ్, ప్రవీణ్ గౌడ్, కో ఆప్షన్ సభ్యులు కవితా ప్రసాద్,నాయకులు గణేష్ గుప్త,శ్రీకాంత్ యాదవ్, మహేందర్ రెడ్డి,శ్రీనివాస్ గౌడ్,పవన్ గౌడ్, మురళి యాదవ్,ఇర్ఫాన్, కొనమొల శ్రీనివాస్,నరసింహ గౌడ్,ప్రభాకర్, హన్మంతు, రాములు, దేవేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఫోటో రైటప్ : మధురా నగర్ లో సిసిరోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్.




