Thursday, 5 November 2026

కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేద్దాం- కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలి

కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేద్దాం- కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలి
* టిపిసిసి సభ్యులు చీమల వెంకటేశ్వర్లు

టేకులపల్లి, జనవరి 16( జనం సాక్షి): రాబోయే అసెంబ్లీ ఎన్నికల కల్లా కాంగ్రెస్ పార్టీని మరింతగా బలోపేతం చేద్దామని, అందుకు ప్రతి కార్యకర్త సైనికుల్లా పనిచేయాలని, హత్ సే హత్ జోడో కార్యక్రమంలో కార్యకర్తలు భాగస్వాములు అవ్వాలని, వాడ వాడన కాంగ్రెస్ జెండా పండుగ నిర్వహించుకుందామని టిపిసిసి సభ్యులు చీమల వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. ఇల్లందు నియోజకవర్గం టేకులపల్లి మండలంలోని గంగారం, వజ్జోని గూడెం,లచ్చగూడెం , టేకుల గుంపు,మేళ్ళ మడుగు గ్రామలలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తలను సోమవారం కలిసి హత్ సే హత్ జోడో కార్యక్రమం గురించి దిశా నిర్ధేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనవరి 26వ తేదీన రేవంత్ రెడ్డి పాదయాత్రలో పాల్గోనడం జరుగుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే, పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క,జిల్లా అధ్యక్షులు ఏమ్మెల్యే పోదెం వీరయ్య ఆదేశానుసారం గ్రామ గ్రామాన జెండా పండుగ నిర్వహించి హత్ సే హత్ జోడో కార్యక్రమంలో కార్యకర్తలు అందరూ భాగస్వామ్యం కావాలని, గడపగడపకు రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్ర యొక్క విశిష్టతను,సందేశం ను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే చేయబోయే కార్యక్రమాలను గడపగడపకు తెలియజేయాలని ఈ సందర్భంగా తెలిపారు.ఈ కార్యక్రమంలో కార్యకర్తలు అందరూ భాగస్వాములై కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం గెలుపు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టేకులపల్లి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు భుక్యా దేవ నాయక్, స్థానిక నాయకులు జోగ చంధ్రశేఖర్ ,బాడిశ వెంకటేశ్వర్లు,ఈసం సురేష్,మూతి రంజిత్,జోగ తేజ,కుంజా శ్రీన