కొలంబో: మహిళా టీ 20 ప్రపంచకకప్‌లో భాగంగా ఆస్ట్రేలియా – ఇంగ్లండ్‌ల మధ్య జరుగుతున్న తుది పోరులో ఆస్ట్రేలియా జట్టు 143 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్ ముందుంచింది, టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా జట్టు నిరీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. కెమరూన్ 45, హెలీ 26, లానింగ్ 25, స్టెల్‌కర్ 23, బ్లాక్ వెల్ 13 పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలలో కోల్‌విన్‌కు రెండు వికెట్లు దక్కగా, హజెల్‌కు ఓ వికెట్ దక్కింది.




